Movies' గుంటూరు కారం ' కోసం ' అత‌డు ' స్టైల్...

‘ గుంటూరు కారం ‘ కోసం ‘ అత‌డు ‘ స్టైల్ సేమ్ ఫాలో అవుతోన్న మ‌హేష్‌…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాట‌ల‌ మంత్రకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ సినిమాపై తెలుగు సినీ జనాల్లో రోజురోజుకు అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. మహేష్ బాబు కి జోడిగా శ్రీలల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా తమన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

హారిక హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ గ్రాండ్ లెవెల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ సాంగ్ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు దర్శకుడు త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ ఫస్ట్ సాంగ్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సాంగ్ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ని ఎలివేట్ చేసేలా చాలా స్టైలిష్ గా పవర్ ఫుల్ గా ఉండబోతుందట. గతంలో త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమాలో స్పెషల్ సాంగ్ ఎంత బాగా క్లిక్ అయిందో.. ఇప్పటికీ జనాల నోళ్లలో ఎలా నానుతుందో తెలిసిందే.

సేమ్ గుంటూరు కారం ఇంట్రడక్షన్ సాంగ్ కోసం కూడా అదే స్టైల్ పాట రెడీ చేస్తున్నారట త్రివిక్రమ్ – తమన్. ఈ సాంగ్ కోసం ఇప్పటికే రెండు వెర్షన్లు ఓకే చేసిన మేకర్స్.. అతి త్వరలోనే ఒకదానిని ఫైనలైజ్ చేసి రిలీజ్ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news