Moviesపుష్ప సినిమాను రిజెక్ట్ చేసిన మంచి పని చేసిన తెలుగు హీరో.....

పుష్ప సినిమాను రిజెక్ట్ చేసిన మంచి పని చేసిన తెలుగు హీరో.. ఎందుకంటే..?

ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే పుష్ప పుష్పరాజ్ నీయవ్వ తగ్గేదేలే ఇదే డైలాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది . రీసెంట్ గా 69 వ జాతీయ అవార్డుల విన్నింగ్ లిస్టు రిలీజ్ చేశారు నిర్వాహకులు . ఈ క్రమంలోని టాలీవుడ్ సినీ చరిత్రను తిరగరాస్తూ మొట్టమొదటిగా ఉత్తమ నటుడిగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వరించింది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన వార్తలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. అయితే ఇలాంటి క్రమంలోనే సుకుమార్ పుష్ప సినిమా కథను రాసుకున్న ఆ హీరో పేరుని ట్రెండ్ చేస్తున్నారు . నిజానికి సుకుమార్ ఈ సినిమా కథను మొదటిగా మహేష్ బాబు కోసం ఊహించుకొని రాసుకున్నారట . అప్పటివరకు క్లాస్ ఇమేజ్ తో మెప్పిస్తున్న మహేష్ బాబు ఈ సినిమా చేస్తే ఫుల్ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోతుంది అంటూ ఎక్స్పెక్ట్ చేశారట.

అయితే ఎవరూ ఊహించిన విధంగా మహేష్ బాబు ఈ సినిమా రిజెక్ట్ చేశారు . ఆ తర్వాత ఈ కథ పలువురు హీరోల వద్దకు వెళ్లిన ఫైనల్లీ చేరాల్సిన హీరో వద్దకే చేరింది . అల్లు అర్జున్ ఈ కథ విని నచ్చి నటించి మెప్పించారు . అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ తే పుష్ప సినిమా మహేష్ బాబు చేయకపోవడమే మంచిది అంటూ చెప్పుకొస్తున్నారు . ఎందుకంటే పుష్ప సినిమా ఫుల్ మాస్ రోల్ మహేష్ బాబు క్లాస్ లుక్స్ కి అది సెట్ అవ్వదు. పుష్ప సినిమాకి ది ఆప్ట్ హీరో అల్లు అర్జున్ అందుకే అల్లు అర్జున్కి ఉత్తమ జాతీయ అవార్డు వచ్చింది అంటూ కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నారు,,!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news