టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ బిజినెస్ మాన్. పోకిరి తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో 2012 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను 2012 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు. పూరి – మహేష్ కాంబినేషన్లో పోకిరి తర్వాత ఇది వరుసగా రెండో హిట్ సినిమాగా నిలిచింది.
ఈ సినిమాలో సూర్య అబ్బాయిగా మహేష్ బాబు పెర్ఫామెన్స్ ఆయన అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్‌ను కూడా బాగా మెప్పించింది. అయితే ఈ నెల 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను మరోసారి గ్రాండ్గా రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఇటీవల టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ నటించిన పోకిరి, ఒక్కడు సినిమాలు రీ రిలీజ్ అయ్యి అదిరిపోయే వసూళ్లు కొల్లగొట్టాయి.
ఈ క్రమంలోనే బిజినెస్మెన్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. అమెరికా, రెండు తెలుగు రాష్ట్రాలు, బెంగళూరు లాంటి చోట్ల అలా బుకింగ్స్ ఓపెన్ ? అయ్యాయో లేదో క్షణాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయి. అయితే బిజినెస్‌మెన్‌ను చాలా సెంటర్లలో వారం రోజులు పాటు ఉంచనున్నారు.
అదే జరిగితే ఈ నెల 10న రిలీజ్ అయ్యే రజనీకాంత్ జైలర్, 11న రిలీజ్ అయ్యే చిరంజీవి భోళా శంకర్ సినిమాలకు ఎంతో కొంత ఎఫెక్ట్ పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బిజినెస్‌మెన్ సినిమా పోకిరి రేంజ్ లో వసూళ్లు రాబడితే అది కచ్చితంగా రజని, చిరంజీవి సినిమాల వసూళ్లపై కొంతవరకు ప్రభావం చూపుతోందని ట్రేడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.