తన కెరీర్‌లో ఎంతో కష్టపడి.. ఒక్కొక్క మెట్టు ఎక్కి.. ఎంతో కీర్తిని సంపాయించుకున్న మహానటి సావిత్రికి వివాహం తర్వాత.. సినిమా ఫీల్డ్ ఏమాత్రం కలిసి రాలేదని చెబుతారు. ముఖ్యంగా తన భర్త.. జెమినీ గణేష న్‌తో కలిసి ఆమె చేసిన ప్రయోగాలు వికటించాయని అంటారు. సొంతగా ఇద్దరూ కలిసి సినిమాలు చేశా రు. వీటికి ఎక్కువగా సావిత్రి డబ్బు సర్దుబాటు చేసింది. తర్వాత.. జెమినీనే దర్శకుడిగా కూడా మారారు.
ఈ సమయంలోనే ఆయనకు మరో నటితో ఏర్పడిన పరిచయం.. సావిత్రి కుటుంబంలోనూ.. కాపురంలోనూ కల్లోలం రేపింది. ఇక, ఆర్థికంగా సావిత్రికి మరిన్ని కష్టాలు తెచ్చిన సినిమా.. చిన్నారి పాపలు. ఈ సినిమాపై సావిత్రి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అగ్ర హీరోయిన్లను కూడా ఈ సినిమాలో పెట్టుకున్నారు. తనే దర్శక త్వం వహించారు. ఈ సినిమాలో ప్రముఖ నటి రాజసులోచన డాన్స్ డైరెక్టర్‌గా పనిచేసింది.
ఇక, సావిత్రి చేతికి ఎముక లేదన్న మాటను ఈ సినిమా రుజువు చేసింది. ఈ చిన్నారి పాపలు సినిమాలో నటించిన వారికి.. ముందుగానే రెమ్యునరేషన్ ఇచ్చేసింది సావిత్రి. దీంతో కొందరు నటులు.. డబ్బులు తీసుకుని.. సినిమా షూటింగులకు ఆలస్యంగా వచ్చేవారు. అంతేకాదు.. అదే సమయంలో వేరే సినిమాలు కూడా ఒప్పేసుకున్నారు. దీంతో సినిమా అనుకున్న సమయానికి పూర్తి కాలేదు.
ఆర్థికంగా కూడా సావిత్రికి ఎన్నో నష్టాలు తీసుకువచ్చింది. అప్పటి వరకు సావిత్రి దర్శకత్వంలో వచ్చిన సినిమా అంటూ ఏదీ లేకపోవడంతో బయ్యర్లు కూడా ముందుకు రాలేదు. ఇక, అదేసమయంలో ఐటీ శాఖ దాడులు.. సావిత్రిని మరింత కుంగదీశాయి. మొత్తానికి ఒకే ఒక్క సినిమా.. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. సావిత్రిని ఆర్థికంగానేకాదు.. మానసికంగా కూడా.. ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందనే చెప్పాలి.