Moviesఅవి చూశాకా కూడా అనన్య చిన్న పిల్ల అనే అంటారా..? కళ్లు...

అవి చూశాకా కూడా అనన్య చిన్న పిల్ల అనే అంటారా..? కళ్లు తెరుచుకోండిరా హీరోలు..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అని ఎంతో కష్టపడి చాలామంది ముద్దుగుమ్మల బాడిని కరెక్ట్ షేపులో పెడుతూ ఉంటారు. కడుపునిండా తినకుండానే అందం కోసం నానా తిప్పలు పడుతుంటారు . అయితే అలా చేసిన పర్ఫెక్ట్ ఫిగర్ ని మెయింటైన్ చేసినా కొంత మంది ముద్దుగుమ్మలకి బ్యాడ్ టైం పక్కనే ఉంటుంది. అసలు అవకాశాలే రావు . అదే లిస్టులోకి వస్తుంది అనన్య నాగళ్ల. మల్లేశం సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలోనూ పలు సినిమాల్లో నటించింది .

అయితే ఆమె నటించిన వకీల్ సాబ్ సినిమా తప్పిస్తే మిగతా ఏ సినిమా హిట్ అవ్వలేదు . కానీ అమ్మడు పేరు మాత్రం సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. దానికి రీజన్ ఎప్పటికప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ చేసే ఫోటో షూటే కారణం అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా అనన్య చేసిన ఫోటోషూట్ అభిమానులకు బాగానే వచ్చేసింది. మరీ వల్గర్ కాదు మరీ ట్రెడిషనల్ కాదు మీడియం రేంజ్ అందాలను ఆరబోస్తూ .. అందాల డోస్ ను అభిమానులకి అందించింది . అయితే ఈ ఫొటోస్ చూసిన అనన్య అభిమానులు తెలుగు డైరెక్టర్ పై హీరోలపై మండిపడుతున్నారు.

ఇంత అందాన్ని కాదని మీరు ఎవరెవరినో తెచ్చి పెట్టుకుంటున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు . అంతేకాదు అనన్య చిన్నపిల్ల గా ఉందన్న కారణంగానే పలువురు హీరోలు ఆమెకి ఛాన్సెస్ ఇవ్వడం లేదు అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే అనన్య లుక్స్ చూసాక కూడా ఇంకా మీరు చిన్న పిల్లఅని అనుకుంటున్నారా..? ఇప్పటికైనా పిలిచి ఆఫర్ ఇవ్వండి బాసు అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . మొత్తానికి అనన్య అభిమానుల దగ్గర నుంచే ఆఫర్లు అందుకునే ప్లాన్ వేసింది అంటూ జనాలు సైతం అమ్మడు తెలివితేటలకి షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news