రెండు దశాబ్దాల క్రితం శృంగార తార షకీలా పేరు చెబితే పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం భయపడిపోయేవారు. షకీలా సినిమాలు థియేటర్లలో ఆడుతున్నాయి అంటే మలయాళంలో స్టార్ హీరోలు సైతం తమ సినిమా రిలీజ్ వాయిదా వేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో యువత అంతా కూడా ఇటువైపు ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతున్నా షకీలా సినిమాలు ఉంటే ఆమె సినిమాలో ఆడుతున్న థియేటర్ల వైపు పరుగులు పెట్టేవారు.
అప్పట్లో షకీలా ఎంతోమంది మగాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అంతలా ఆమె మలయాళ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తుంది. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు కన్నడం, తెలుగు, తమిళంలో కూడా రిలీజ్ అయ్యాయి. అప్పట్లో ఆమె నటించిన సినిమాలు సగటున నెలకు రెండు రిలీజ్ అవుతూ ఉండేవి. కుర్ర కారు అయితే ఆమె సినిమాల కోసం పిచ్చెక్కిపోయేవారు. అంతలా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది షకీలా.
ఇప్పటికీ కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ నటనపై తనకున్న మక్కువ పోలేదని ప్రూవ్ చేసుకుంటున్నారు షకీలా. అయితే వెండితెరకు పరిచయం అయ్యే ముందు షకీలా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారట. తాజాగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన ఆమె తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను బయటపెడుతున్నారు. కేరళకు చెందిన షకీలా 1990 – 2000వ దశకంలో చాలా శృంగా.. సినిమాల్లో నటించారు.
తాజాగా ప్రముఖ నటుడు వడివేలుపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిన షకీలా తన తొలి శారీరక సంబంధం గురించి కూడా మాట్లాడింది. తన కన్యత్వం కోల్పోవడంపై ఆమె మాట్లాడింది. తాను వర్జిన్ కాదని.. తన స్నేహితుడితో తాను మొదటి సారి శరీరాన్ని పంచుకున్నానని.. అతడి పేరు రిచర్డ్ ఫాల్ అని కూడా ఓపెన్ అయిపోయింది. ప్రస్తుతం షకీలా చేసిన ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.