మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే ఒక మహిళ నిర్మాత ఉన్నారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా పలు వెబ్ సీరిస్‌లు చేయడంతో పాటు రెండు సినిమాలు కూడా నిర్మించారు. అయితే ఇవేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఆమె ఏకంగా తన తండ్రి చిరంజీవి హీరోగా ఒక భారీ బడ్జెట్ సినిమా నిర్మిస్తున్నారు. మళయాళం లో హిట్ అయిన బ్రోడాడీ సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
కురసాల కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకులు. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాతో తన కుమార్తెను నిలబెట్టాలని చిరు పట్టుదలతో ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఇదే కాంపౌండ్ నుంచి ఇప్పుడు మరో మహిళా నిర్మాత కూడా రాబోతుంది. ఆమె ఎవరో ? కాదు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదల. ఆమె కూడా తన సొంత బ్యానర్ ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే g5కు కంటెంట్ ఇచ్చారు. త్వరలోనే మరికొన్ని వెబ్ సిరీస్ లు కూడా నిర్మిస్తానని ప్రకటించింది.
ఇది ఇలా ఉంటే తాను కూడా సినీ రంగంలోకి నిర్మాతగా అడుగు పెట్టబోతున్న విషయాన్ని నిహారిక ప్రకటించింది. ముందుగా సుష్మిత చిన్న సినిమా తీశారు.. ఇప్పుడు మెగాస్టార్ తో పెద్ద సినిమా తీస్తున్నారు. నిహారిక కూడా ఇదే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా లో బడ్జెట్ సినిమా నిర్మించి రిలీజ్ చేసిన తర్వాత.. ఆ అనుభవంతో మెగా హీరోతో సినిమా ప్లాన్ చేయాలని అనుకుంటుందట.
మెగా కాంపౌండ్ లో చాలామంది హీరోలు ఉన్నారు. దీంతో నిహారిక కు హీరోల సమస్య లేదు. ఏది ఏమైనా తన అక్కకు పోటీగా నిహారిక కూడా నిర్మాతగా మారుతుంది. మరి ఈ ఇద్దరు అక్కచెల్లెళ్ల పోటీలో ఎవరు ?భవిష్యత్తులో పై చేయి సాధిస్తారు.. ఎవరి బ్యానర్ ఎక్కువ విజయాలు సొంతం చేసుకుంటుంది అన్నది చూడాలి.