బుల్లితెర నటి రీతూ చౌదరి జబర్దస్త్ షో ద్వారా పిచ్చ పాపులారిటీ సొంతం చేసుకుంది. పలు సీరియల్స్‌లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటో షూట్లతో నిత్యం కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం జబర్దస్త్ షోకు దూరంగా ఉంటూ వస్తోన్న రీతూ చౌదరి తన అభిమానులను అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటుంది.
అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్లు చేస్తూ ఉంటుంది. ఏ మాత్రం టైం దొరికినా చాలు తన ఫాలోవర్స్‌తో ఓ ముచ్చట్లు పెడుతూ వారు అడిగే ప్రశ్నలకు కొంటెగా ఆన్సర్లు చెపుతూ ఉంటుంది. తాజాగా రీతూ వర్మకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ అమ్మడు చాటింగ్‌లో భాగంగా అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుంటానని చెప్పిందట.
రీతూ వర్మ అంటేనే అంత ఫేమస్ కాదు. అలాంటిది ఆమె ఏకంగా అక్కినేని ఇంటికి పెద్ద కోడలిగా వెళ్లే ప్లాన్‌లో ఉందా ? అసలు నీకు అంత సీన్ ఉందా ? చైతు ఎక్కడ ? నువ్వ ఎక్కడ ? అని అక్కినేని ఫ్యాన్స్ రీతూపై మండి పడుతున్నారు. మరి కొందరు మాత్రం చైతుకు భార్య కావాలంటే ఓ రేంజ్ ఉండాలి… అది సమంతకు దక్కింది.. నీకు అంత రేంజ్ ఉందా ? అని ప్రశ్నిస్తున్నారు.
మరి కొందరు మాత్రం విడాకులు తీసుకున్న చైతును బుట్టలో పెట్టేవా ? లేదా మంత్రం వేశావా ? చైతుకు నీకు పడతాడా ? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా అక్కినేని ఇంటి కోడలు రీతూ అంటూ మొత్తానికి సోషల్ మీడియాలో పెద్ద టాపిక్కే నడుస్తోంది.