Newsమోస్ట్ వాంటెడ్ గజదొంగ వచ్చేసాడురోయ్.. టైగర్ నాగేశ్వరరావు పవర్ ఫుల్ టీజర్...

మోస్ట్ వాంటెడ్ గజదొంగ వచ్చేసాడురోయ్.. టైగర్ నాగేశ్వరరావు పవర్ ఫుల్ టీజర్ రిలీజ్(వీడియో)..!!

టాలీవుడ్ మాస్ మహారాజగా పేరు సంపాదించుకున్న రవితేజ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా “టైగర్ నాగేశ్వరరావు”. వరుస ఫ్లాప్ సినిమాలతో అల్లాడిపోతున్న రవితేజకు ఈ సినిమా హిట్ అవ్వడం చాలా కీలకం. కాగా రియల్ లైఫ్ స్టోరీ తో తెరకెక్కుతున్న పిరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీగా టైగర్ నాగేశ్వరరావు లో రవితేజ చాలా ఢిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు.

19’స్ కాలంలో స్టూవర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామంటూ డైరెక్టర్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చేసాడు . ఈ చిత్రంలో రవితేజ పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాడు . అంతేకాదు ఈ సినిమాని డైరెక్ట్ చేసేది కొత్త దర్శకుడు వంశీ . అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన లుక్స్ , గ్లింప్స్ అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి.

కాగ కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచిపవర్ ఫుల్ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఆంధ్రప్రదేశ్ గోదావరి గట్టున పుట్టిన టైగర్ నాగేశ్వరరావు గజదొంగ మొత్తం దేశాన్ని ఎలా గడగడలాడించాడో ఒక్కటి చిన్న టీజర్ తోనే చెప్పేసి సోషల్ మీడియాని షేక్ చేశారు . టీజర్ లోని యాక్షన్ సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స పక్క అని చెప్పక తప్పదు . అంతేకాదు చాలా రోజుల తర్వాత రవితేజని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఈ సినిమాతో చూడబోతున్నారు . ఈ సినిమాలో హీరోయిన్స్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మలు నుపూర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. ఇక చాలా గ్యాప్ తరువాత హీరోయిన్ రేణూ దేశాయ్‌ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తూ రీ ఎంట్రీ ఇస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news