Moviesచిరంజీవి కెరీర్ ఎందుకు గాడి త‌ప్పింది… ఈ వ‌రుస ప్లాప్‌ల‌కు కార‌ణం...

చిరంజీవి కెరీర్ ఎందుకు గాడి త‌ప్పింది… ఈ వ‌రుస ప్లాప్‌ల‌కు కార‌ణం ఎవ‌రు ?

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో3 దశాబ్దాలు క్రిందట తిరుగులేని ట్రెండ్ సెట్ చేశారు. నటుడుగా చిరంజీవికి వంక పెట్టడం **ఆయనకి ఏమీ లేదు. ఆయన ఇమేజ్ ఆకాశంలో ఉంటుంది ఇండస్ట్రీలో టాప్ పోజిషన్ నుంచి అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే వరకు ఎన్నో రికార్డులు ఆయన సొంతం అన్ని రకాల జోనర్స్ కథ‌లని కవర్ చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది ఒకప్పుడు చిరంజీవి సినిమాలు అంటే మాస్, క్లాస్, ఫ్యామిలీ, ఎంటర్టైన్ చేసేవారు అటు డ్యాన్సులు డైలాగులు ఫైట్లు అన్ని ఉండేవి ఇప్పుడు ఆయన రేంజ్‌కు తగిన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా రావటం లేదు అనేది సగటు మెగా అభిమాని ఆవేదన.

చిరంజీవి ఇప్పటివరకు తన కెరీర్‌లో 35 సినిమాలకు పైగా రీమేక్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన వయసు 68 సంవత్సరాలు తన వయసుకు తగినట్టుగా కథ‌లని ఎంపిక చేసుకుని సినిమాలు చేయాల్సిన వయసు ఇది. అయితే ఈ సమయంలో 10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఆయన వరుసగా రీమిక్‌ సినిమాలు చేస్తూ ఆయన అభిమానులనే బాగా నిరుత్సాహపరుస్తున్నారు. ఖైదీ నెంబర్ వన్ 150, గాడ్ ఫాదర్ ,భోళా శంకర్‌తో పాటు మలయాళం లో హిట్ అయిన బ్రో డాడి సినిమా రీమిక్‌ లో కూడా నటించాలని చూస్తున్నారు.

ఈ రీమిక్స్ అనేవి పెద్దగా వర్క్ అవుట్ కావడం లేదు. ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం పైగా ఓటీటీలు వచ్చేసాయి. ఒక భాషలో రిలీజ్ అయిన సినిమా పది రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇలా ఇతర భాషలో సినిమాలు కూడా అన్ని భాషల ప్రేక్షకులు చూస్తున్నారు. అలాంటి సినిమాలని రీమిక్ చేయటం వల్ల జరిగే లాభం కంటే డ్యామేజ్ ఎక్కువ జరుగుతోంది. ఈ విషయం అందరికీ తెలుసు అయినా చిరంజీవి వరుసగా రీమిక్‌ సినిమాలు చేస్తూ అభిమానులకు మేకులు దించుతున్నారు.
ఒకప్పుడు చిరంజీవి అభిమానులకు నచ్చే సినిమాలు చేసేవారు.

అయితే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది.. కేవలం అభిమానులకు నచ్చే సినిమాలు చేస్తే సరిపోదు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలి సినిమా బాగుంది బాగోలేదు అని డిసైడ్ చేసేది అభిమానులు కాదు నార్మల్ ఆడియన్స్. వీళ్ళకి నచ్చాలంటే ట్రెండ్ కు తగినట్టుగా డిఫరెంట్ స్టోరీలు ఎంచుకోవాలి ఓవైపు రజినీకాంత్, కమలహాసన్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలు తమ వయసుకు తగిన సినిమాలు ఎంచుకుంటూ సూపర్ హిట్‌లు కొడుతున్నారు. అయితే చిరంజీవి మాత్రం అటు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ మీద ఇంకా కుర్రాడిలా ఉండేందుకు తెగ తాపత్రయపడుతున్నారు.ఇవి అభిమానులకు నచ్చవ‌చ్చు గానీ సాధారణ ప్రేక్షకుడికి మాత్రంఆస‌లు న‌చ్చ‌దు.. పైగా చిరంజీవి 2007 తర్వాత 10 ఏళ్ల పాటు గ్యాప్ తీసుకున్నారు..

ఆ తరం జనరేషన్ సినీ అభిమానులకు చిరంజీవికి మధ్య గ్యాప్ కూడా వచ్చింది. వీటితోపాటు ఇంకా చాలా కారణాలు చిరు కెరీర్ గాడి తప్పటానికి కారణం అవుతున్నాయి. దీనికి తోడు చిరంజీవి చుట్టూ చేరిన కొందరు భజన పరులు కూడా ఆయనకు సరైన కథలు ఎంచుకోకుండా రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారని అందువల్లే చిరుకి వరుసగా ప్లాప్‌లు ఎదురవుతున్నాయి అన్న చర్చిలైతే ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news