టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాబీయింగ్ ఫలించలేదు. ఆయన తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కోసం బీఆర్ఎస్ టిక్కెట్ కోసం చేసిన లాబీయింగ్ వర్కవుట్ కాలేదు. 2014 ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఈ సారి తన మామ కోసం అల్లు అర్జున్ మంత్రి కేటీఆర్ దగ్గర కూడా లాబీయింగ్ చేస్తూ వచ్చారన్న ప్రచారం జరిగింది.
ఈ సారి ఆయన స్వగ్రామం పెద్దవూర మండలం ఉన్న నాగార్జున సాగర్ అసెంబ్లీ సీటు కోసం చాలా ప్రయత్నాలు చేశారు. నాలుగు రోజుల క్రితం కూడా పెద్దవూర మండలంలో కంచర్ల కన్వెన్షన్ సెంటర్ ఓపెన్ చేసి జిల్లాకే చెందిన మంత్రి జగదీష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఇటు తన అల్లుడు అల్లు అర్జున్‌ను కూడా పిలిచారు.
ఇక 10 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఎలాగైనా తన అల్లుడు ద్వారా కేటీఆర్‌తో లాబీయింగ్ నడిపించి మామ చంద్రశేఖర్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ రోజు కేసీఆర్ రిలీజ్ చేసిన 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో నాగార్జునా సాగర్ సీటును తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్‌కే కేటాయించారు. దీంతో బన్నీ లాబీయింగ్ అయితే ఫలించలేదు.