Moviesబయటపడ్ద కృష్ణం రాజు పరసనల్ డైరీ.. అనుష్క-ప్రభాస్ ల పెళ్లి పై...

బయటపడ్ద కృష్ణం రాజు పరసనల్ డైరీ.. అనుష్క-ప్రభాస్ ల పెళ్లి పై ఏం రాసుకున్నారు అంటే..?

సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ – హీరోయిన్ అనుష్కల పెళ్లి మేటర్ . వీళ్ళ పెళ్లికి సంబంధించిన వార్తలు కొన్ని సంవత్సరాలుగా వైరల్ అవుతున్నాయి . అయితే అలాంటి వార్తలు వైరల్ అయిన ప్రతిసారి అనుష్క కానీ ప్రభాస్ కానీ మా మధ్య లాంటిది లేదు అంటూ చెప్పుకొస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళ అభిమానులు మాత్రం కాదు కాదు .. మీ మధ్య ప్రేమ ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అనుష్క -ప్రభాస్ ల పెళ్లి మ్యాటర్ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది .

రీసెంట్గా వీళ్ళ పెళ్లికి సంబంధించి మరో న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . దానికి కారణం రీసెంట్గా రెబల్ హీరో కృష్ణంరాజు డైరీ బయటపడడమే . మనకు తెలిసిందే.. కృష్ణంరాజు అనారోగ్య కారణంగా మరణించారు . ఈ టైంలోనే రెబల్ ఫ్యామిలీ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ దృశ్యాలు ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే రెబెల్ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని విషయాలను కృష్ణంరాజు డైరీలో నోట్ చేసుకున్నారట .

ఆ డైరీ ఆలస్యంగా బయటపడింది . ఈ క్రమంలోనే ఆ డైరీలో అనుష్క ప్రభాస్ ల పెళ్లి గురించి కూడా ఆయన రాసుకున్నారు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. పరోక్షంగా ప్రభాస్ తనకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే చూడాలని ఉందని.. ప్రభాస్ పిల్లల్ని ఎత్తుకొని ఆడించాలని ఉందని రాసుకొచ్చారట. ఈ క్రమంలోనే ఇది పూర్తిగా అనుష్క – ప్రభాస్ ల పెళ్లి గురించి అంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు కృష్ణం రాజుకి కూడా అనుష్క – ప్రభాస్ లు పెళ్లి చేసుకుంటే ఇష్టమే అని.. ఇక ప్రభాస్ ఆలస్యం చేయకుండా అనుష్కను పెళ్లి చేసుకోవాలని ,,పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని సజెస్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news