సినిమా ఇండస్ట్రీలో అందంగా ఉండకపోతే జనాలు చూడరు. జనాలు చూడని ముఖాలను డైరెక్టర్ లు అస్సలు పట్టించుకోరు. అందుకే సినిమా ఇండస్ట్రీలో అందంగా ఉండడానికి యంగ్ బ్యూటీ లు తాపత్రయ పడుతూ ఉంటారు. కేవలం యంగ్ బ్యూటీసే కాదు .. 50 క్రాస్ చేసిన అందాల ఆంటీలు కూడా అందంగా కనిపించడానికి తెగ ట్రై చేస్తూ ఉంటారు . ఆ లిస్టులోకే వస్తుంది .. కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న రమ్యకృష్ణ.
ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. ఎంత చెప్పినా అది చిన్నగానే అనిపిస్తుంది. చెప్పే కొద్ది చరిత్రలు వస్తూనే ఉంటాయి . అయితే సీనియర్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న రమ్యకృష్ణ ప్రెసెంట్ సినీ పరిశ్రమలలో సీనియర్ పాత్రలు చేస్తూ మెప్పిస్తుంది . అయినా సరే హీరోయిన్ కి ఏ మాత్రం తగ్గని రేంజ్ లో అందంగా తయారవుతుంది . అంతేకాదు అంతే అందంగా కూడా కనిపిస్తుంది.
రీసెంట్గా జైలర్ సినిమాలోని కావాలయ్యా సాంగ్ తనదైన స్టైల్ లో ఎలాంటి హాట్ స్టెప్స్ వేసిందో రమ్యకృష్ణ మనకు తెలిసింది . అయితే ఏజ్ 52 క్రాస్ చేసిన ఇంకా ఎంత అందంగా ఉండడానికి కారణం ఆమె తీసుకునే ఫుడ్ డైట్ ఆమె చేసే వర్కౌట్సే అంటూ తెలుస్తుంది . రమ్యకృష్ణ ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందట . ఏది పడితే అది తినడట . నచ్చిన ఫుడ్ ని కూడా లిమిటెడ్ గానే తినడానికి చూస్తుందట. ఈ క్రమంలోనే ఆమె వర్క్ అవుట్స్ కూడా ఎక్కువగా చేస్తుందట . అందుకే 52 వయసు వచ్చిన ఇంకా పదహారేళ్ల అమ్మాయిలానే కనిపిస్తుంది అంటున్నారు అభిమానులు . దీంతో సోషల్ మీడియాలో రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ వైరల్ గా మారింది..!!