ఒకప్పుడు సౌత్ ఇండియాలోనే తిరుగులేని స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు ప్రశాంత్. ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటించిన తెలుగు, మలయాళ, హిందీ సినిమాలలో కూడా మెప్పించాడు… ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన త్యాగరాజన్ కుమారుడే ప్రశాంత్. 17 సంవత్సరాల వయసులోనే ఓ తమిళ సినిమాతో హీరోగా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన జీన్స్ సినిమా ప్రశాంత్ కెరీర్ లోనే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో ప్రశాంత్ కి జోడిగా మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ హీరోయిన్గా నటించారు.
అప్పట్లో అజయ్, విజయ్ లాంటి హీరోలతో పోటీపడి వారికి మించిన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కెరీర్ పరంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలోనే తన భార్యతో వివాదాలు.. ఆ తర్వాత వరుస ప్లాపులతో ప్రశాంత్ ఫేడవుట్ అయిపోయాడు. ఇక విడాకుల సమయంలో వచ్చిన వివాదాలతో కూడా ప్రశాంత్ కెరీర్ పాతాళానికి పడిపోయింది. చాలా రోజుల తర్వాత తెలుగులో రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో చరణ్ కు అన్నగా కలెక్టర్ పాత్రలో ప్రశాంత్ కనిపించాడు.
తాజాగా తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ, సినీ విశ్లేషకుడు కాంతరాజు ప్రశాంత్ గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. ప్రశాంత్ తన తండ్రి త్యాగరాజు డైరెక్షన్లో అంధాగన్ సినిమా తీస్తున్నారు. ఇంతటితో ఆయన సినిమాలు చేయకపోవటమే మంచిది.. వేరే ఉద్యోగం చూసుకుంటే మంచిది.. ప్రస్తుతం సినిమాలు మారిపోయాయి… ప్రశాంత్‌లో గతంలో ఉన్న హీరోయిజం లేదు. ఇప్పుడు సినిమా బాగుంటేనే చూస్తున్నారు. ఇక ప్రశాంత్ వైవాహిక జీవితంలో కూడా కొన్ని సమస్యలు వచ్చాయి.. దీంతో అతని కెరియర్ పతనమైందని కాంతరాజు పేర్కొన్నాడు.
ప్రశాంత్‌కి 2005లో వ్యాపారవేత్త కుమార్తె గృహలక్ష్మితో పెళ్లయింది. ఈ దంపతులకు ఒక పాప కూడా జన్మించాడు. పెళ్లయిన మూడేళ్ల తర్వాత ఇద్దరు విడిపోయారు. గృహలక్ష్మి తన పుట్టింటికి వెళ్లి పోయింది. తన పాపను చూసేందుకు వారి ఇంటికి వెళ్లిన ప్రశాంత్‌ను వారు అనుమతించేవారు కాదట. ఇక తన భార్యను తిరిగి పొందేందుకు ప్రశాంత్ కోర్టును ఆశ్రయించాడు. అప్పట్లో ఇది పెద్ద దుమారం అయింది. అయితే వీరి జీవితంలోకి అనుకోకుండా నారాయణన్ అనే వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు.
ప్రశాంత్ కంటే ముందే గృహలక్ష్మిని తన పెళ్లి చేసుకున్నానని.. గృహలక్ష్మి తనను 1998లోనే పెళ్లాడుందని వాదించాడు. దీంతో ప్రశాంత్ మనసు కకావికలం అయింది. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకు కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. కూతురిని తన దగ్గర వదిలివేయాలని ప్రశాంత్ కోరగా కోర్టు అంగీకరించలేదు. ఇవన్నీ కలిసి ప్రశాంత్ పేడౌట్ కావడానికి కారణం అయ్యాయి.