Moviesజీరో ఫిగర్ అరియాన ఇలా డ్రమ్ లా మారిపోవడానికి కారణం అదేనా.....

జీరో ఫిగర్ అరియాన ఇలా డ్రమ్ లా మారిపోవడానికి కారణం అదేనా.. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందా..?

సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్స్ ఏ కాదు బుల్లితెర బ్యూటీస్ కూడా జీరో ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తున్నారు. వాళ్లలో మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ . యూట్యూబ్ ఛానల్ ద్వారా యాంకరింగ్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న అరియానా.. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వచ్చి అందరికీ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.

జెన్యూన్ గా గేమ్ ఆడి లేడీ టైగర్ అంటూ ట్యాగ్ చేయించుకున్న అరియానా.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేసింది. అయితే అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు . అయితే ఏమనుకునిందో ఏమో కానీ సన్నగా బక్క పలుచగా జీరో సైజ్ ఉండే ఆమె సడన్గా వెయిట్ పెరిగింది . ఎలా అంటే చూడడానికి లడ్డు లా మారిపోయింది. దీంతో అరియానా ఫొటోస్ ని ట్రోల్ చేస్తున్నారు జనాలు. అంతేకాదు అసలు ఎందుకు ఆమె ఇంతలా మారిపోయింది ..ఆ అవసరం ఏముంది అంటూ క్వశ్చన్స్ చేస్తున్నారు.

అయితే అరియానా గ్లోరీ అతన్ని గాఢంగా ప్రేమిస్తుందని .. వాళ్ళ ఇంట్లో పెట్టిన కండిషన్ కారణంగానే ఆమె బొద్దుగా తయారైందని ..ఆమె ప్రేమించిన అబ్బాయి కొంచెం బొద్దుగా ఉంటాడని.. ఈమె బక్క పలుచగా ఉంటే చూడడానికి ఈడు జోడు బాగోదని.. ఆ కారణంగానే కాబోయే అత్తగారు కండిషన్ ప్రకారం అరియానా గ్లోరీ బరువు పెరిగిందని చెప్పుకొస్తున్నారు . ఒకవేళ అదే నిజమైతే త్వరలోనే అరియానా నుంచి గుడ్ న్యూస్ వినడం పక్కా అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news