Moviesతన 68ఏళ్ల జీవితంలో ఫస్ట్ టైం ..పుట్టిన రోజు నాడు అలాంటి...

తన 68ఏళ్ల జీవితంలో ఫస్ట్ టైం ..పుట్టిన రోజు నాడు అలాంటి పని చేసిన చిరంజీవి..!!

నేడు టాలీవుడ్ మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి పుట్టిన రోజు . నేడు అయిన 68వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. భారీ కటౌట్లతో.. ఫ్లెక్సీలతో.. పాలాభిషేకాలతో.. పూలదండలతో మెగాస్టార్ ఫొటోస్ ను వైరల్ చేస్తున్నారు అభిమానులు . ఇలాంటి క్రమంలోనే ఇన్నేళ్ల తన జీవితంలో ఏనాడు ఏ పుట్టినరోజుకు చేయని పనిని ఫస్ట్ టైం ఈ పుట్టిన రోజుకి చేశాడు చిరంజీవి అనే న్యూస్ వైరల్ గా మారింది .

జనరల్ గా ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవికి ఫస్ట్ విష్ చేసేది తల్లి అంజనా దేవి గారే. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు చిరంజీవి . ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నా ..ఎంతమంది శ్రేయోభిలాషులు ఉన్న ముందు మా అమ్మ చేత విష్ చేయించుకోవడమే నాకు చాలా చాలా ఇష్టం.. అదే నాకు శ్రీరామరక్ష అంటూ కూడా చెప్పుకొచ్చారు.

అయితే ఈసారి మాత్రం తన మనవరాలు రాకతో ఆ రూల్స్ బ్రేక్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి . స్వయానా అర్ధరాత్రి 12 గంటలకు వెళ్లి” ఇవాళ నా పుట్టినరోజు తల్లి అంటూ పాప కి ముద్దు పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేయించుకున్నారట “. ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . అయితే ప్రతిసారి తన తల్లి ఫస్ట్ విష్ చేసే చిరంజీవికి ఈసారి ఫస్ట్ విషెస్ మనవరాలు అందజేసింది. దీంతో మెగాస్టార్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాదు మెగాస్టార్ సైతం తన పుట్టినరోజు నాడు మనవరాలని అస్సలు వదిలిపెట్టడం లేదు అంటూ తెలుస్తుంది . ఆయనకు ఈ పుట్టినరోజు చాలా చాలా స్పెషల్ అంటూ చెప్పుకొస్తున్నారట. దీంతో ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news