చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి తొలిరోజు తొలి ఆటకే పెద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా దెబ్బతో చిరంజీవితో పాటు డైరెక్టర్ మెహర్ రమేష్ పై విమర్శల వర్షం కురుస్తుంది. మెగా అభిమానులతో పాటు సగటు సినీ అభిమానులు కూడా వీరిద్దరిని ఆడేసుకుంటున్నారు. ఇక చిరంజీవి అభిమానులు కూడా రజనీకాంత్ జైలర్ సినిమా చూసి రజినీని చూసి నేర్చుకో చిరంజీవి… ఈ వయసులో కూడా నీకు హీరోయిన్లు అవసరమా ? ఎందుకు అంత కమర్షియల్ సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటావు అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం చిరంజీవికి నిర్మాత అనిల్ సుంకర ఏకంగా రు. 65 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకానొక టైంలో సినిమాకు సరిగా బిజినెస్ కూడా జరగక అనిల్ సుంకర ఈ సినిమా శాటిలైట్ రైట్స్ చిరంజీవికి ఇచ్చి కొంత అమౌంట్ సర్దుబాటు చేయాలని చూసినా కూడా చిరంజీవి అస్సలు ఒప్పుకోలేదన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపించాయి. నాకు ఇలాంటి లింకులు పెట్టొద్దు నాకు ఇవ్వాల్సిన రు. 65 కోట్లు పక్కాగా ఇవ్వమని మొహం మీద చెప్పేశారట.
దీంతో అనిల్ సుంకర రు. 60 కోట్లు నగదు రూపంలో చెల్లించి.. మరో ఐదు కోట్లకు చెక్కు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఇదే టైంలో నిర్మాత అనిల్ సుంకర ఈ ఏప్రిల్ లో అక్కినేని హీరో అఖిల్ హీరోగా ఏజెంట్ సినిమాను నిర్మించారు. ఏజెంట్ కూడా డిజాస్టర్ అయింది. ఆ సినిమా కూడా డెఫిషెట్‌తో రిలీజ్ అయింది. అయితే హీరో అఖిల్ నిర్మాత అనిల్ సుంకర ఇబ్బంది పడకూడదని పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు.
ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు సినీ జనాలు.. ట్రేడ్ వర్గాలు కూడా చిరంజీవి అఖిల్ ని చూసి నేర్చుకుంటే మంచిది అని.. ఈ వయసులో కూడా కనీసం నిర్మాత కష్టనష్టాలు అసలు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణం అంటున్నారు. రు. 65 కోట్ల రెమ్యూనరేషన్ ముక్కపిండి వసూలు చేశాడని.. నిర్మాత అనిల్ ఇటు సినిమాతో ఘోరంగా నష్టపోయాడని సినిమా రిలీజ్ కి ముందే 4 కోట్ల డెబిషెట్తో రిలీజ్ అయితే చిరంజీవి ఏ మాత్రం సాయం చేయకపోవడం దారుణం అంటూ విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా వాల్తేరు వీరయ్య సినిమా కంటేభోళాశంకర్ సినిమాకు పది కోట్లు అదనంగా రెమ్యూనరేషన్ పెంచేయడం.. సినిమా ప్లాప్ అయితే నిర్మాతను పట్టించుకోకోవడం చాలా దారుణం అన్న కామెంట్లు కూడా వస్తున్నాయి.