Newsఅత్త గారి ముందే ఆ హీరోయిన్‌తో చెట్టాప‌ట్టాలేసుకుని జైల‌ర్ చూసిన ధ‌నుష్...

అత్త గారి ముందే ఆ హీరోయిన్‌తో చెట్టాప‌ట్టాలేసుకుని జైల‌ర్ చూసిన ధ‌నుష్ ( ఫొటోల‌తో బుక్‌)

టాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ – తమన్నా జంటగా నటించిన తాజా సినిమా జైలర్. విజయ్ తో బీస్ట్ సినిమా తీసిన డైరెక్ట‌ర్‌ నెల్సన్ దిలీప్ కుమార్ ఎంతో కసితో జైలర్ సినిమా తెరకెక్కించి మళ్లీ సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ – జాకీష్రాఫ్ – కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తదితరులు నటించారు. దీంతో సౌత్ ఇన్ ఇండియన్ స్టార్ హీరోలు అంతా కూడా మొదటి రోజు థియేటర్లోకి వెళ్లి మరి ఈ సినిమా చూసి రజనీకాంత్ శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు హిట్ టాక్‌ కూడా వచ్చింది. రెండు రోజుల్లోనే ఏకంగా రు. 140 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. అదే సమయంలో నటువంటి ధనిష్ కూడా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నా కూడా తొలిరోజు టైం తీసుకుని జైలర్ సినిమా చూసేందుకు థియేటర్ కి వెళ్ళాడు. అప్పటికే అదే ధియేటర్లో తన మాజీ అత్తగారు కూడా సినిమా చూడటానికి వెళ్లారు.

అక్కడి వరకు బాగానే ఉంది. అయితే ధనుష్ సింగిల్ గా ఆ సినిమా చూసేందుకు వెళ్లలేదు.. నటి త్రిష‌ తో కలిసి అత్తగారి ముందే అదే థియేటర్లో సినిమా చూస్తూ నానా రచ్చ చేశాడని కోలీవుడ్లో వార్తలు వచ్చాయి.
అలాగే వీరిద్దరూ థియేటర్ లోపల ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రిష ఫోటో తీస్తుంటే ధనుష్ రచ్చ చేస్తున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఇక రజనీ కుమార్తె ఐశ్వర్యతో విభేదాలు వల్ల ధనుష్ దూరంగా ఉంటున్నాడు. ఇఎప్పటికే వీరిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు.

ఈ క్రమంలోనే హీరోయిన్ త్రిషతో ధ‌నుష్ ప్రేమాయణం నడుపుతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ధ‌నుష్ – త్రిష క‌లిసి వెళ్లడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న వార్తల‌కు మరింత బలం చేకూరినట్లు అయింది. అయితే అభిమానులు మాత్రం ఇవి పాత ఫోటోలు నెట్ లో షేర్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. మరి అసలు నిజం ఏంటో ధనుష్ చెబితేనే క్లారిటీ రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news