మామూలుగానే హరీష్‌శంకర్‌కు కాస్త యాట్యిట్యూడ్ ఎక్కువ అన్న టాక్ ఉంది. ఏదైనా ఒక్క హిట్ పడితే హరీష్‌ను అస్సలు భూమ్మీద ఆపలేమనే అంటారు. ఈ క్రమంలోనే ఓ టాలీవుడ్ స్టార్ హీరో సినిమా షూటింగ్ జరుగుతుండగా నేను నీకు హిట్ ఇస్తానంటూ ఓవర్ చేయబోతే ఆ హీరో దిమ్మతిరిగేలా ఆన్సర్ ఇవ్వడంపై అప్పట్లో సినీ వర్గాలు బాగా చర్చించుకున్నాయి. సర్లే అదంతా గతం..!
రీసెంట్గా సంతోషం పత్రిక అధినేత, ఇటీవల జర్నలిస్టు అవతారం ఎత్తిన సురేష్ కొండేటి 2018 సినిమా ఫంక్షన్లో ఏదే ప్రశ్న వేస్తే దానికి హరీష్ శంకర్ కౌంటర్ ఇస్తూ సురేష్ ఇటీవల యూట్యూబ్‌లో పాపులర్ అయ్యేందుకు ఓ భీభత్సమైన ప్రశ్న వేశాననుకుంటున్నాడని.. అది ట్రెండ్ చేసుకుంటున్నాడన్న అర్థం వచ్చేలా మాట్లాడుతూ చివర్లో సెటైర్ కూడా వేశాడు.
వినేవాడు సురేష్ అయితే చెప్పేవాడు హరీష్ అన్న పంచ్ డైలాగ్ బాగానే పేలింది.. అక్కడున్న వాళ్లు నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు హరీష్ శంకర్ రియల్ లైఫ్‌లో వినేవాడు హరీష్ శంకర్ అయితే.. చెప్పేవాడు త్రివిక్రమ్ అన్నట్టుగా కొనసాగుతోందన్న గుసగుసలు, సెటైర్లు ఇండస్ట్రీలో వినపడుతున్నాయి. అసలు విషయంలోకి వెళితే ఏళ్లకు ఏళ్లుగా వార్తల్లోనే ఉంటోంది ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా.
గబ్బర్‌సింగ్ తర్వాత పవన్ ఛాన్స్ ఇచ్చాడని హరీష్‌శంకర్ మురిసిపోయాడు. ఈ సినిమాతో గబ్బర్‌సింగ్ మ్యాజిక్ రిపీట్ చేస్తామంటూ ప్రగల్బాలు పలికాడు. ఈ సినిమా అనుకున్నాక బ్రో సెట్స్ మీదకు వెళ్లింది.. రిలీజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్ట్స్ ఓజీ కూడా అయిపోతోంది. ఆ తర్వాత వారహి యాత్రలున్నాయ్.. ఏపీలో ఎన్నికలు.. ఆ తర్వాత క్రిష్ హరిహర వీరమల్లు.. ఆ తర్వాత కావాలంటే త్రివిక్రమ్‌తో మరో సినిమా కూడా పవన్ చేసేయొచ్చు.. కానీ ఈ ఉస్తాద్ భగత్‌సింగ్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో అర్థంపర్థం కాని పరిస్థితి.
పాపం ఊసురోమంటూ పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడా ? అని ఎదురు చూపులు చూడడం మినహా చేసేదేం లేదు. అసలు పవన్ ఇప్పుడున్న టైట్ షెడ్యూల్లో హరీష్ శంకర్ సినిమాకు డేట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. సరే పవన్ ఎప్పుడిస్తే అప్పుడే సినిమా చేస్తాను… అనుకుంటే వచ్చిన ఇబ్బందేం లేదు. ఒకానొక దశలో త్రివిక్రమ్ తీరుతో హరీష్ కూడా విసిగిపోయాడనే అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు త్రివిక్రమ్ ప్రాపకం లేనిదే పవన్ ఎవ్వరికి డేట్లు ఇవ్వడం లేదు.
కనీసం పవన్ నాలుగు అడుగులు వేయాలన్నా కూడా త్రివిక్రమ్ చెపితేనే కానీ చేయట్లేదన్నంత గుసగుసలు నడుస్తున్నాయి. చివరకు ఈ సినిమా మేకర్లకు మిగిలింది ఏంటంటే ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే ట్వీట్ మాత్రమే..! ఈ సినిమా కంటిన్యూగా 90 రోజులు ఇస్తే గాని షూటింగ్ పూర్తవ్వదు. ఇప్పుడు పవన్ అంత ఖాళీగా లేడు. అందుకే హరీష్ కూడా ఉస్తాదో చెరువో గాని ముందు ఈ లోగా రవితేజతో సినిమా చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయాడనే అంటున్నారు. ఇప్పుడు చెప్పేవాడు.. చేసేవాడు త్రివిక్రమ్ అయితే.. చూసేవాడు.. వినేవాడు హరీష్ శంకర్‌నే కదా మరి..!