టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఎప్పటికప్పుడు మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు రూట్స్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. రామ్ ఇండస్ట్రీలోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. తన కెరీర్ లో చాలా సక్సెస్ లు అందుకున్నా మాస్ హీరోగా సరైన గుర్తింపు రాలేదు. ఇప్పటికీ ఫ్యామిలీ హీరో – కుర్ర హీరో – లవ్ స్టోరీ హీరో గానే రామ్‌కు ఇమేజ్ ఉంది.
ఒక్క ఇస్మార్ట్ శంకర్ సినిమా మాత్రం రామ్‌ని మాస్ హీరోగా కాస్త నిలబెట్టింది. ఈ మూవీ అతడి ఇమేజ్ ని కూడా అమాంతం మార్చేసింది. ఈ సినిమా తర్వాత రామ్ కెరీర్ కాస్త స్లో అయింది. గత ఏడాది కోలీవుడ్ దర్శకుడు లింగస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన సక్సెస్ అందుకోలేదు.
అయితే ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలన్న కసిర్చుతో యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంధ మూవీ చేశారు. బోయపాటి సినిమా అంటేనే మాస్ ఆడియన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి. పైగా ఈ సినిమాలో శ్రీల హీరోయిన్. రామ్ రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు.. ఎప్పటికే ప్రేక్షకులు ముందుకు వచ్చిన పాటలు కూడా ఆకట్టుకున్నాయి. స్కంధ సెప్టెంబర్ 15న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. మొత్తం రు. 50 కోట్ల వరకు బిజినెస్ డీల్స్ జరిగాయని.. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా ఇప్పటికే పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా నిర్మాతకు తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. ఏకంగా ఐదు భాషలలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. హిందీలో కూడా బోయపాటి యాక్షన్ మోడ్ కధలకి మంచి ఆదరణ ఉంది. దీంతో అక్కడ కూడా బాగానే బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.