Moviesసాయి పల్లవికి ఎప్పుడో పెళ్లి అయిపోయిందా..? పెళ్లి మండపంలో ఎంత సిగ్గుపడుతుందో...

సాయి పల్లవికి ఎప్పుడో పెళ్లి అయిపోయిందా..? పెళ్లి మండపంలో ఎంత సిగ్గుపడుతుందో చూడండి….వీడియో వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకు మలయాళ బ్యూటీనే అయినా సరే తెలుగు పరిశ్రమలో పలు సినిమాల్లో నటించి సూపర్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది . అంతేకాదు ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకున్న సాయి పల్లవి ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ స్థానాన్ని ఆకుపై చేసుకుంది .

సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్ చేయనప్పటికీ ఆమె స్టార్ హీరోయిన్గా మారడం గర్వకారణం . అంతే కాదు నేటి సమాజంలో ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటున్నా అమ్మాయిలకు సైతం సాయి పల్లవి ఆదర్శంగా నిలుస్తుంది . రీసెంట్ గా సాయి పల్లవి పెళ్ళి చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది . కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరిగింది. అయితే అవన్నీ పుకార్లు అంటూ కొట్టి పడేసిన నటి .. ఆ తర్వాత సినిమా అప్డేట్స్ ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో రీసెంట్గా సాయి పల్లవి పెళ్లి వీడియో వైరల్ గా మారింది . ఇది రీల్ లైఫ్ లో జరిగింది రియల్ లైఫ్ లో జరిగింది కాదు . 2018 లో ఏ ఎల్ విజయ్ తెరకెక్కించిన తమిళ్ – తెలుగు ద్వీభాష చిత్రం కణం . ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది సాయి పల్లవి . ఈ సినిమా ఫ్లాప్ అయింది . అయితే ఈ సినిమాలో వీరిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకోగా పెళ్లి చేసుకున్నప్పటి సీన్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది .

పెళ్లి మండపంలో సాయి పల్లవి నాగశౌర్య చాలా చక్కగా కనిపించారు . అంతే కాదు పెళ్లి తర్వాత ఇంటికి వచ్చి తన భార్య ఒంటరిగా దొరికితే ముద్దులు పెట్టుకుందాం అనే కోరికతో నాగశౌర్య ఆమె వెనకనే తిరగడం.. ఫైనల్లీ వన్ మూమెంట్ చూసి రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసేయడం ..అయితే ఇది చూసి అక్కడే ఉన్న ముసలి భామల గుంపు ముసి ముసి నవ్వులు నవ్వుకునే సన్నివేశాలు చాలా చాలా హైలెట్ అయ్యాయి . ఈ క్రమంలోనే మరోసారి ఆ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దీంతో సోషల్ మీడియాలో సాయి పల్లవి పెళ్లి వీడియో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది . కాగా ఈ వీడియోలో సాయి పల్లవి సిగ్గు చూస్తే నిజమైన పెళ్లి వీడియో లాగే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news