Moviesప్రభాస్ ‘ కల్కి 2898 AD ’ సినిమాపై డిజ‌ప్పాయింట్ న్యూస్‌.....

ప్రభాస్ ‘ కల్కి 2898 AD ’ సినిమాపై డిజ‌ప్పాయింట్ న్యూస్‌.. నాగ్అశ్విన్ ఇలా చేశావేంటి..!

టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ కల్కి 2898 AD. ఇటీవల యుఎస్ఏ లోని శాండియాగోలో కామిక్ కాన్ గ్రాండ్ ఈవెంట్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. టైటిల్ అఫీషియ‌ల్‌గా చెప్ప‌డంతో ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయ‌గా… దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇంకా చెప్పాలంటే స‌లార్ టీజ‌ర్ విజువ‌ల్స్ కంటే కూడా క‌ల్కి 2898 విజువ‌ల్స్ అదిరిపోయాయ‌నే ఎక్కువ మంది చెపుతున్నారు. గ్లింప్స్‌లో విజువ‌ల్స్ అయితే ఖ‌చ్చితంగా మ‌న‌ల‌ను మ‌రో ప్ర‌పంచంలోకి తీసుకుపోయాయి. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ దీపికా పదుకొణె న‌టిస్తోండ‌గా… బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరియు దిశా పటానీ, కమల్ హాసన్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

క‌మ‌ల్ అయితే సినిమాలో విల‌న్‌గా క‌నిపిస్తున్నాడు. క‌ల్కి కూడా రెండు పార్టులుగా తెర‌కెక్కుతోంది. ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్ సోమ‌వారం నుంచి హైద‌రాబాద్‌లో ప్రారంభంకానుందట‌. ఈ సినిమాను వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ రు. 600 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా ముందుగా సంక్రాంతికి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయాల‌నుకున్నారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ స‌మ్మ‌ర్‌కు వాయిదా వేసిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ సినిమా కోసం క‌ళ్లుకాయ‌లు కాచేలా వెయిట్ చేస్తోన్న ఫ్యాన్స్‌కు ఇది కాస్త నిరాశ అయిన అంశంమే అని చెప్పాలి. నాగ్ అశ్విన్ చిన్న సీన్‌కు కూడా చాలా ప‌ర్‌ఫెక్ష‌న్‌గా ఉండ‌డంతో సినిమా లేట్ అవుతోంద‌ట‌. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news