టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్హ చేసే చిలిపి అల్లరితో చిన్న వయసులోనే ఆమె ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో అల్లు అర్హకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. అంతేకాకుండా ఈ ఏడాది సీనియర్ హీరోయిన్ సమంత ప్రధానోపాత్రలో తెరకెక్కిన శాకుంతలం సినిమాలో అర్హ భరతుడు పాత్రలో తన ముద్దు ముద్దు పాటలతో ఆకట్టుకుంది.
బన్నీ కూడా ఎప్పటికప్పుడు తన కూతురితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. తాజాగా అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అంటూ ఒక ఫోటో తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. అందులో అర్హ తన అన్న అయాన్ చేయి పట్టుకుని స్కూల్కు వెళుతున్న దృశ్యం కనిపించింది. ఈ ఫోటోలో అల్లు అయాన్, అర్హ ఇద్దరు వెనక నుంచే కనిపిస్తున్నారు.
ఫొటో వెనక వైపు నుంచి ఉన్నా కూడా ఇద్దరి బ్యాగుల మీద వారి స్కూల్ బ్యాగులు ఉన్నాయి. ఈ పిక్ చూసిన బన్నీ ఫ్యాన్స్ అర్హ స్కూల్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు.