Movies40 ఏళ్ల వ‌య‌స్సులోనూ స్టార్ హీరోల‌కు జోడీ.. ఈ స్టార్ హీరోయిన్...

40 ఏళ్ల వ‌య‌స్సులోనూ స్టార్ హీరోల‌కు జోడీ.. ఈ స్టార్ హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ తెలుసా..!

పై ఫోటోలో కురులు విరబోసుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఒక స్టార్ హీరోయిన్. ఆమెను తెలుగు ప్రేక్షకులు అంతగా గుర్తుపట్టకపోవచ్చు.. కానీ మలయాళ, తమిళ సినీ ప్రియులకు ఆమె అభిమాన హీరోయిన్. ఆమె పేరు మంజు వారియర్. నాలుగు పదుల వయసులోనూ స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన తెగింపు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది.

నాలుగు పదుల వయసులోనూ చెక్కుచెదరని అందంతో ఉన్న మంజూ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ దొరికితే చాలు మంజు బైక్ రైడింగ్ చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు వీనుల‌ విందు చేస్తూ ఉంటుంది. తాజాగా మంజూ షేర్ చేసిన ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. పింక్ షిఫాన్ చీరలో అందమే అద్భుతమ అన్నట్టుగా మంజూ కనిపిస్తోంది.

అలాగే ఆమె ధరించిన చెవిపోగులు, భారీ సిల్వర్ రింగ్స్ జత చేసింది. నేచురల్ మేకప్ లు.. పింక్ లిప్‌స్టిక్ తో కన్నార్పకుండా ఆమెనే చూసేంత అందం మైంటైన్ చేస్తోంది. మంజు చివరిసారిగా వెల్లరి పట్టణం అని మలయాళ సినిమాలో కనిపించింది. అలాగే ప్ర‌స్తుతం ఆమె నటిస్తున్న మలయాళ సినిమా షూటింగ్లో బిజీబిజీగా ఉంది. త్వరలోనే మంజు అమ్రికీ పండిట్తో నటిస్తున్న సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆర్ మాధవన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది .

మంజు 1990వ ద‌శ‌కంలో మలయాళంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. పెళ్లి తర్వాత చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె నాలుగు ప‌దుల వయసులో రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా దూసుకుపోవటం చాలా గ్రేట్ అని చెప్పాలి. అందరికీ వయసు పెరుగుతుంటే మంజు కి మాత్రం తగ్గుతుందన్న కామెంట్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. ఆమె న‌టిగా మాత్రమే కాదు.. మంచి క్లాసికల్ డాన్సర్ కూడా..! ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు సరైన జోడీగా మంజు ఉంటుంది. ఆమెకు మరి మన స్టార్ హీరోలు ఎవరైనా ఛాన్సులు ఇస్తారేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news