టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకు ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా మన్మధుడు అనే కట్యాగ్ చేయించుకొని ఇప్పటికీ నవ మన్మధుడుగానే అనిపించుకుంటున్నాడు నాగార్జున . మన ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల భార్యలు ఆల్మోస్ట్ అందరూ నాగార్జునకు అభిమానులు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే బయటకు చాలా సరదాగా కూల్ గా ఉండే నాగార్జున పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది .
కానీ ఇప్పటివరకు నాగార్జున ఎక్కడ కూడా ఫైర్ అయిన సందర్భాలు లేనే లేవు . ఈ క్రమంలోనే అసలు నాగార్జునకు కోపం రాదా..? అంటూ కూడా జనాలు ఆశ్చర్యపోతూ ఉంటారు . అయితే రీసెంట్ గా అక్కినేని అఖిల్ నాగార్జున కోపానికి సంబంధించి షాకింగ్ సీక్రెట్ ను బయటపెట్టారు . అఖిల్ మాట్లాడుతూ..” మా నాన్నకి కోపం వస్తుంది . మా నాన్నకి కోపం వస్తే ఖచ్చితంగా అలాంటి పనే చేస్తారు . ఒకవేళ అలా చేసినట్లయితే ఆయన కోపం చాలా చాలా త్వరగా తగ్గిపోతుంది ..మనకి హింటు కూడా ఇచ్చేస్తుంది”.
” అంత ఈజీగా మా నాన్నకి ఎవరిపై కోపం రాదు.. వస్తే మటుకు ఫాస్ట్ గా కిచెన్ లోకి వెళ్లి ఎవరికి ఏమేమి వంటకాలు ఇష్టమో అన్ని వండేస్తారు . స్వయంగా తీసుకొచ్చి వడ్డిస్తారు . అప్పుడే మనకు అర్థం అయిపోతుంది . ఈయన ఏదో కోపంలో ఉన్నారు అని .. అయితే ఎంత కోపంలో ఉన్న వంట మాత్రం చాలా రుచిగా వస్తుంది. అందుకే మా నాన్న కిచెన్ లోకి వెళ్తే మాకు భయం “అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. అయితే పలువు అమ్మాయిలు మాత్రం నాగార్జున గారికి ఉన్న ఈ హ్యాబిట్ అందరి మగాళ్లకి ఉంటే బాగుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు..!!