Moviesఆ రోజు వెక్కి వెక్కి ఏడ్చిన మహేశ్ బాబు.. ఆ బాధ...

ఆ రోజు వెక్కి వెక్కి ఏడ్చిన మహేశ్ బాబు.. ఆ బాధ భరించలేక నమ్రత ఏం చేసిందో తెలుసా..? ప్రేమ అంటే ఇదేగా..!!

రీజన్ ఏంటో తెలియదు కానీ .. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు, హీరోయిన్లు అందరూ వరుసగా రోగాలు బారిన పడిపోతున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ లు అయితే రకరకాల వింత వ్యాధుల బారిన పడుతూ ఆ విషయాలని ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు. ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్ సమంత మరి కొంత మంది హీరోయిన్స్ వింత జబ్బులకు గురైన విషయం తెలిసిందే. సమంత అయితే ఏకంగా ఆమె గురైన మయోసైటిస్ వ్యాధి కోసం అమెరికా వెళ్లి మరి ట్రీట్మెంట్ తీసుకుంటుంది .

ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు సైతం ఓ జబ్బుతో బాధపడుతున్నాడు అంటూ తెలుస్తుంది. ఆయన గత కొంతకాలంగా మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారట . ఇదేమి కొత్త జబ్బు కాక పోయినప్పటికీ మహేష్ కి వచ్చిన మైగ్రేన్ సమస్య మాత్రం వేరే కొత్త లక్షణాలతో ఉందట . చిన్న కూల్ ఐటమ్స్ తిన్నా.. కూల్ క్లైమేట్ లో కి వెళ్లిన తన ఫేస్ మొత్తం రాషెస్ రావడం.. కొంచెం ఇబ్బందికరంగా మారడం అవుతూ ఉండేదట .

ఈ క్రమంలోనే దీనికోసం ఎక్కడెక్కడ నుంచో వైద్యులను సైతం పిలిపించి ట్రీట్ మెంట్ తీసుకున్నారట. ఫారిన్ కంట్రీస్ లో సైతం చికిత్స తీసుకున్నారట . కానీ ఏ చికిత్స కూడా ఆయనకి ఈ వ్యాధి నయం చేయలేక పోయిందట. దీంతో మహేశ్ చాలా రోజులు ఆ నొప్పికి ఏడ్చేసేవాడట. ఈ క్రమంలోనే ఆయన బాధను చూసి భార్య నమ్రత కూడా తన స్నేహితురాఓ సహాయంతో డాక్టర్ సత్య సింధుజాను కలిసి చక్ర సిద్ధ నాడి వైద్యం చేయించిందట . ఒక్క సిట్టింగ్ లోనే ఈ వ్యాధి మహేష్ బాబుకు నయమైపోయిందట . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవ్వరైన ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే ఇలా చక్రసిద్ధి నాడి వైద్యం చాలా చక్కగా పనిచేస్తుందని స్వయంగా మహేష్ బాబునే ఈ చికిత్సను ప్రమోట్ చేస్తున్నారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news