దేవిక. ఒకప్పటి అగ్రహీరోయిన్. అనేక సినిమాల్లో ఎన్టీఆర్‌తో కలిసి నటించారు. మరికొన్ని జానపద సిని మాల్లో హీరోయిన్ ఓరియెంటెండ్ పాత్రల్లోనూ తన నటనతో విజృంభించారు. ఎక్కువగా తెలుగు సినిమా ల్లో అయితే.. రామారావు, లేకపోతే కత్తి కాంతారావు సరసన ఆమె హీరోయిన్‌గా తెరను పంచుకున్నారు. ఎక్కడా వివాదాలకు తావు లేకుండా.. రాకుండా.. కొన్నేళ్లపాటు కెరీర్‌ను ముందుకు తీసుకువెళ్లారు. అంతేకాదు.. రెమ్యునరేషన్ గురించి కూడా ఆలోచించేవారు కాదట.
అయితే.. ఆమె తన వారసురాలిగా సినీతెరకు తన కుమార్తెను పరిచయం చేశారు. ఆమె పేరు కనక. కేవ లం తెలుగులో రెండే సినిమాలు చేసింది కనక. అవి కూడా ఒకటి అన్నగారు ఎన్టీఆర్‌తోనూ..(బ్రహ్మర్షి విశ్వామిత్ర), రెండోది రాజేంద్రప్రసాద్(వాలు జడ తోలు బెల్టు) సరసన. అయితే.. తమిళంలోనూ.. మలయాళంలోనూ కనక అనేక సినిమా్ల్లో నటించి.. తన ప్రతిభను చాటుకుంది. కానీ, సినీమా రంగంలో ఎక్కవ కాలం కనక నిలబడలేక పోయింది.
నటన బాగున్నా.. ప్రేక్షకులు మెచ్చుకున్నా.. ఎక్కడ సమస్య వచ్చిందంటే.. తన తల్లి దేవిక దగ్గరే అసలు సమస్య వచ్చింది. తెలుగు/తమిళ సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం నటించిన దేవిక.. అన్ని రంగాలను ఔపోసన పట్టింది. ఎడిటింగ్ నుంచి మేకప్ వరకు లైట్ బోయ్ నుంచి డ్రాపింగ్ వరకు అన్ని విషయాలను చదివేసింది. దీంతో అభద్రతా భావం ఎక్కువగా కనిపించేది.
ఎవరో ఏదో చేస్తారని.. నమ్మించి మోసం చేస్తారని.. దేవిక భావించేదట. దీంతో ఆమె సినిమా రంగంలో ఎవరినీ నమ్మేది కాదు. ఇంటికి కూడా ఎవరినీ రానిచ్చేవారు కాదట. ఎవరైనా సరే.. ఫోన్ చేసిన తర్వాత.. ఇంటికి రానిచ్చేవారట. ఇలా.. తన జీవితంలో ఎదురైన ఘటనల నేపథ్యంలో కుమార్తె కనక ఎక్కడికి వెళ్లినా.. ఆమె వెంటే దేవిక కూడా వెళ్లేది. తరచుగా.. మేకప్ మెన్‌లను మార్చేసేదట. అంతేకాదు.. హీరోలతో ఎక్కువగా మాట్లాడనిచ్చేది కూడా కాదట. దీంతో కనక కెరీర్ బాగా దెబ్బకొట్టేసింది. ఎంతో కెరీర్ ఉన్న ఆమెకు అవకాశాలు రాకుండా పోయాయి. దీంతో మానసిక ఒత్తిడికి గురై.. ఇంటి నుంచి వెళ్లిపోయిందట.