సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్లుగా హీరోలుగా మారిన స్టార్స్ ఎంతోమంది ఉన్నారు . అయితే మరికొందరు ఒకటి రెండు సినిమాలకే ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయినా క్యూట్ లిటిల్ బ్యూటీస్ కూడా ఉన్నారు. ఆ లిస్టులోకే వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్నారి పాప. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ తో కలిసి సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన ఈ పాప గుర్తుండే ఉంటుంది .
మరిచిపోయే నటన మొదటి సినిమాతోనే మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి క్యూట్ క్యూట్ గా అనిపించుకున్న ఈ పాప పేరు వర్ణిక . అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చినటువంటి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాలో తన ముద్దు ముద్దు మాటలతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ పాప. ఆ తర్వాత కొన్ని రోజులు సినిమాకి దూరమైంది .
మళ్లీ నాన్నకు ప్రేమతో అనే సినిమా ద్వారా రకుల్ ప్రీతిసింగ్ చిన్నప్పటి క్యారెక్టర్ లో నటించి మెప్పించింది . ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. ఈ చిన్నారి పాప ఇప్పుడు శ్రద్ధ చదువుపైన పెట్టిందట . అంతేకాదు పెద్దయ్యాక ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలని కూడా ట్రై చేస్తుందట . అందుకే ముందు బుద్ధిగా చదువుకొని.. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడానికి ఆలోచిస్తుందట . చూడాలి మరి రాబోయే రోజుల్లో అయినా ఈ పాప సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో..?