సిల్క్ స్మిత ఈ పేరు చెబితే తెలుగు సినీ అభిమానుల్లో ఓ అందమైన అమ్మాయి రూపం కనపడుతుంది. సిల్క్ ఫేస్‌లో ఎన్నో తళుకులు. సిల్క్ స్మిత అప్పట్లో ఓ సెన్సేషన్. ఐటెం సాంగ్ లకు ఆమె పెట్టింది పేరు. తన అందచందాలతో అప్పట్లో ఎంతో మంది కుర్రకారును మత్తెక్కించింది. ఆమె అసలు పేరు వడ్లపట్ల విజయలక్ష్మి. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు సమీపంలోని కొవ్వలి ఆమె స్వగ్రామం
ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి ఉండేది. అయితే సినిమాల్లోకి ఎలా ? వెళ్లాలి అన్నది ఆమెకు తెలియలేదు. ఈ క్రమంలోనే తనకు తెలిసిన వారిద్వారా ఆమె చెన్నై వచ్చి అక్కడ కొందరు ఇళ్లల్లో పనులు చేసేది. అలా ఆమె సినిమాల్లోకి రాకముందు అప్పటి స్టార్ హీరోయిన్ అపర్ణ ఇంట్లో పనిమనిషిగా చేరింది. ఇల్లు తుడవడం.. అంట్లు తోమటం.. ముగ్గులు వేయడం ఇలాంటి పనులు సిల్క్ స్మిత చేసేదట.
అయితే ఆమెకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే బాగా ఇష్టం. జీనత్ అమన్ లాంటి గొప్ప డ్యాన్సర్ ను కావాలన్నా కోరిక ఆమెకు బలంగా ఉండేది. దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఒక మగాడు ఒక ఆడది సినిమా ద్వారా ఆమె తొలిసారిగా వెండితెరకు పరిచయం అయింది. సీనియర్ హీరోయిన్ జయప్రద సోదరుడు రాజబాబుకు జోడిగా ఆ సినిమాలో ఆమె నటించింది. ఆ తర్వాత తమిళంలోనూ ఒకి రెండు సినిమాలలో వేశ్య పాత్రలలో నటించింది.
ఎప్పుడు అయితే సిల్క్ స్మిత ఐటెం సాంగ్స్ కు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టిందో అక్కడి నుంచి ఆమె కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత ఆమె పేరు సిల్క్ స్మితగా మారిపోయింది. అక్కడి నుంచి తెలుగు, తమిళం, కన్నడం ఇలా చెప్పుకుంటూ పోతే సౌత్ సినిమా ఇండస్ట్రీని తన మత్తెక్కించే కళ్ళతో ఒక ఊపు ఊపేసింది.