Moviesస‌మంత - విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ధ్య ఏజ్ గ్యాప్ తెలుసా… ఎవ‌రు...

స‌మంత – విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ధ్య ఏజ్ గ్యాప్ తెలుసా… ఎవ‌రు ఏజ్ ఎక్కువంటే..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. నాగచైతన్యకు విడాకులు ఇచ్చాక వరుసగా సినిమాలు చేస్తోంది. పుష్ప‌ సినిమాలో ఐటమ్ సాంగ్లో నటించిన సమంత.. విజయ్ దేవరకొండకు జోడిగా ఖుషి సినిమాలో నటించింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ ఒకటిన విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లు షురూ అయ్యాయి. నిన్న మొన్నటి వరకు వెకేషన్ లో ఎంజాయ్ చేసిన సమంత ప్రస్తుతం ఖుషి సినిమా ప్రమోషన్లలో ఫుల్ రిలాక్స్ గా ఉన్నట్టు కనిపిస్తోంది.

ఖుషి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే విజయ్ దేవరకొండ చేతుల్లో వాలిపోయి అతడు గిరాగిరా తిప్పుతుంటే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. వీరిద్దరూ చాలా రొమాంటిక్గా లైవ్లో చేయటం సినిమాకు మంచి హైప్‌ వచ్చింది. ఈ సినిమాలో సమంత – విజయ్ దేవరకొండ ముందు ప్రేమికులుగాను తర్వాత భార్యాభర్తలుగా కనిపించనున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ జోడిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ‌ నడుస్తోంది. ఈ సినిమాలో విజయ్‌కు లవర్ గా.. భార్య‌గా నటించిన సమంత విజయ్ కంటే రెండు సంవత్సరాలు పెద్దది కావడం విశేషం. ప్రస్తుతం సమంత వయసు 36 సంవత్సరాలుగా.. విజయ్ దేవరకొండ వయసు 34 సంవత్సరాలు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news