Moviesఅసలు తరుణ్ తో నీహారిక పెళ్లి రూమర్ ఎలా పుట్టిందో తెలుసా..?...

అసలు తరుణ్ తో నీహారిక పెళ్లి రూమర్ ఎలా పుట్టిందో తెలుసా..? ఆ ఒక్క ఫోటోనే కొంప ముంచిందా..?

గత పది రోజులుగా సోషల్ మీడియాలో నిహారిక రెండో పెళ్లి వార్త ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు బాగా తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుని నిహారిక రీసెంట్ గానే విడాకులు ఇచ్చేసింది. దానిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . అప్పటినుంచి సోషల్ మీడియాలో నిహారిక రెండో పెళ్లి వార్త దూసుకుపోతుంది . ఒకప్పటి స్టార్ హీరో తరుణ్ మెగా అల్లుడు కాబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది .

అయితే రీసెంట్ గా దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చాడు తరుణ్. “అలాంటిది ఏదీ లేదని.. ఉంటే స్వయంగా నేనే ప్రకటిస్తానని” చెప్పుకొచ్చాడు . అంతేకాదు తాజాగా నిహారిక సైతం స్పందించింది . అసలు ఇంతవరకు నేను చూడలేదు ..మాట్లాడలేదు మరి ఆయనతో నాకు రెండో పెళ్లి ఎలా చేస్తారు? ఇంత చెత్త రూమర్ ఎలా పుట్టించారు ..? అంటూ ఫైర్ అయింది . అయితే అసలు ఈ రూమర్ పుట్టడానికి మెయిన్ రీజన్ నిహారిక షేర్ చేసిన ఫోటోలు అంటూ తెలుస్తుంది . విడాకుల తర్వాత ఎవరైనా సైలెంట్ గా ఉంటారు.. లేదంటే బాధపడుతూ ఉంటారు.. ఒకవేళ ఇవేవీ కాకపోతే కనీసం సోషల్ మీడియాలో ఆనందంగా ఉన్న ఫొటోస్ ని మాత్రం షేర్ చేయరు.

ఇప్పటివరకు విడాకులు తీసుకున్న చాలా మంది జంటలు ఇలానే చేశారు. సమంత నాగచైతన్య ధనుష్ ఎవరైనా కానివ్వండి.. విడాకులు తీసుకున్న కొన్ని రోజుల వరకు సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్ చేయలేదు . అయితే నిహారిక మాత్రం పద్ధతిగా చీర కట్టుకొని చాలా ట్రెండీగా హాట్ గా దర్శనమిచ్చింది. ఫ్రెండ్స్ తో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ సరదా సరదా వీడియోలను పోస్ట్ చేసింది. ఈ ఫొటోస్ చూసి చాలామంది నిహారికకు అసలు భర్తను వదిలేసిన బాధే లేదని చాలా జాలీగా తిరుగుతుందని ఈమె త్వరలోనే రెండో పెళ్లి చేసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదని అనుకున్నారు . అంతేకాదు తరుణ్ అంటే మెగా ఫ్యామిలీకి ముందు నుంచి ఓ ప్రత్యేకమైన అభిమానం. మెగా డాటర్స్ అందరూ ఒకప్పుడు తరుణ్ అభిమానులే.. అందుకే అలా ఈ రూమర్ కలిసి వచ్చింది . అయితే ఇది కేవలం రూమరే.. కానీ నిజం ఏమాత్రం కాదు అసలే మండిపోతున్న మెగా ఫ్యామిలీ కు ఈ రూమర్ మరింత మండిపోయేలా చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news