Moviesదీపికా పై అలాంటి కామెంట్స్ చేసిన ప్రభాస్ .. ఇంటెర్నేషనల్ మీడియాలో...

దీపికా పై అలాంటి కామెంట్స్ చేసిన ప్రభాస్ .. ఇంటెర్నేషనల్ మీడియాలో అడ్డంగా బుక్కైన డార్లింగ్ హీరో..!!

ప్రభాస్ పై ఈ మధ్య కాలంలో జనాలు కూసింత ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనే చెప్పాలి. అందుకే ఆయన కి సంబంధించిన విషయాలు ఎక్కువుగా ట్రెండ్ అవుతున్నాయి. కాగా రీసెంట్ గా ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ కల్కి 2898 AD సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు . ఈ క్రమంలోని ఫస్ట్ టైం హీరోయిన్ దీపికతో రొమాన్స్ పై స్పందించాడు ప్రభాస్.

ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ..” దీపిక గురించి ఎంత చెప్పినా తక్కువే .. ఆమె పెద్ద సూపర్ స్టార్.. చాలా అందంగా ఉంటుంది.. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఆమె గురించి అందరికి తెలుసు కదా ..నేను ఇంకేం చెప్తాను.. ఇంటర్నేషనల్ బ్రాంచ్ కి సైతం యాడ్స్ చేసింది.. అంబాసిడర్ గా ఉంది ..చాలా చాలా టాలెంటెడ్ ..ఆమె సెట్స్ కి వచ్చిందంటే కొత్త ఎనర్జీ వచ్చేస్తుంది ..అందరిలో ఉత్సాహం వస్తుంది.. తనతో ఎప్పటి నుంచి స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకున్నాను.. కానీ కుదరలేదు ఫైనల్లీ ఆ కోరిక నెరవేరింది ..ఆమెని నటిగా బాగా ఇష్టపడతాను” అంటూ చెప్పుకొచ్చాడు .

అయితే ప్రభాస్ మాట్లాడిన మాటల్లో ఎక్కడ తప్పు లేకపోయినా సరే కొందరు జనాలు ప్రభాస్ పై మండిపడుతున్నారు . “మేము నీ నోటి నుంచి అనుష్క పేరు తప్పిస్తే మరి ఎవరిపై ఇలాంటి పాజిటివ్ కామెంట్స్ వినడానికి ఇష్టపడం డార్లింగ్” అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు నువ్వు త్వరగా పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఎంత బాధ పడతావో తెలియదు కానీ మీ అభిమానులుగా మేము ఎంతో బాధపడతాం.. ప్లీజ్ అనుష్కను పెళ్లి చేసుకో అంటూ సజెస్ట్ సజెషన్స్ ఇస్తున్నారు. దీపికాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు పరోక్షకంగా అనుష్క ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తున్నాయి ..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news