Moviesచిరు బర్త డే స్పెషల్ : "క్లీం కార" ఫోటో ని...

చిరు బర్త డే స్పెషల్ : “క్లీం కార” ఫోటో ని షేర్ చేసిన రామ్ చరణ్.. ఎంత క్యూట్ గా ఉందో చూసారా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి పుట్టిన రోజు నేడు . తన 68వ పుట్టినరోజును చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, ఫ్యాన్స్ , ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆయనకి విష్ చేస్తున్నారు . కానీ ఈసారి చిరంజీవి బర్త డే చాలా స్పెషల్ అని చెప్పాలి .

ఆయన ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బుల్లి మెగా వారసురాలు ఇంటికి వచ్చేసింది . రామ్ చరణ్ కి రీసెంట్ గానే కూతురు పుట్టిన విషయం తెలిసిందే . ఆమెకు క్లీం కార అని నామకరణం కూడా చేశారు . ఈ క్రమంలోనే తాతకు చాలా స్పెషల్గా విష్ చేసింది క్లింకార. కాగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న క్లీం కార ఫోటోని రిలీజ్ చేశాడు రామ్ చరణ్ . అయితే ఈ ఫోటోలో ఆమె ఫేస్ కనిపించకుండా హార్ట్ సింబల్ ని పెట్టుకొచ్చారు .

అయినా సరే పాప ఫేస్ కట్స్ ఈజీగా కనిపెట్టేస్తున్నారు . ఆమె చాలా క్యూట్గా బొద్దుగా అనిపిస్తుంది . అంతే కాదు బుగ్గలు కూడా చాలా పెద్దవిగా ఉన్నట్లు ..ఆ ఫోటోలు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆ పాపం మొత్తం ఉపాసనల చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు రామ్ చరణ్ సైతం నాన్నకు స్పెషల్గా బర్త్డ డే విషెస్ అందించారు . “హ్యాపీ బర్త డే చిరుత.. చిరంజీవి తాత “అంటూ మెన్షన్ చేశారు. దీంతో ఈ ఫోటోను మెగా అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. మొత్తానికి చిరంజీవి తన 68వ పుట్టిన రోజును చాలా చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నారనే చెప్పాలి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news