Moviesచరణ్ Vs బన్నీ ఎడ‌మొఖం.. పెడ‌మొఖం… గొడ‌వ‌లు పీక్స్‌కు వెళ్లిపోయాయా ?

చరణ్ Vs బన్నీ ఎడ‌మొఖం.. పెడ‌మొఖం… గొడ‌వ‌లు పీక్స్‌కు వెళ్లిపోయాయా ?

మెగా ఫ్యామిలీ హీరోలు రామ్ చరణ్ – అల్లు అర్జున్ మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయన్నది ఎప్పటినుంచో వినిపిస్తున్న సమాచారం. ముఖ్యంగా సినిమాలపరంగా ఈ ఇద్దరి మధ్య మొదలైన ఆధిపత్య పోరు ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. చిరంజీవి 10 ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పుడు చరణ్ సినిమా కథలను ఎంపిక చేసే బాధ్యతను అల్లు అరవింద్ చేతులో పెట్టాడు. అయితే అరవింద్ తాను విన్న కథలలో మంచివి ఉంటే బన్నీకి సజెషన్ చేశాడు.. కాస్త కథ అటు ఇటుగా ఉంటే అది చరణ్‌కు ఓకే చేయిస్తున్నాడు.

అలా చ‌ర‌ణ్ చేతికి రావాల్సిన కొన్ని హిట్టు సినిమాలు బ‌న్నీ ఖాతాలోకి వెళ్లాయి. చిరంజీవికి ఈ విషయం తెలియడంతో రామ్ చరణ్ సినిమా ఎంపిక బాధ్యతలు పూర్తిగా తీసుకున్నాడు. అక్కడ నుంచి చరణ్ రంగస్థలం సినిమాతో బన్నీ పై చేయి సాధించాడు. ఆ టైంలో బ‌న్నీపై మెగాభిమానుల హ‌డావిడి బాగా న‌డిచింది. ఆ తర్వాత బన్నీ అలవైకుంఠపురంలో – పుష్ప‌ సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అప్పుడు బ‌న్నీ ఫ్యాన్స్ స‌ప‌రేటుగా ఏఏ ఆర్మీ పేరుతో హంగామా చేశారు.

తర్వాత చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో మళ్లీ పై చేయి సాధించాడు. ఇలా ఈ ఇద్దరు హీరోల మధ్య పెద్ద యుద్ధం అయితే నడుస్తోంది. పైకి ఎవరు ఎన్ని చెప్పినా ఇద్దరి మధ్య వృత్తిపరమైన పోటీ చివరకు వ్యక్తిగతమైన పంతం వరకు వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా పుష్ప సినిమాకు బన్నీకి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. బన్నీకి చాలామంది ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. చివరకు పొలిటికల్ గా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా మెచ్చుకున్నారు.

అయితే రామ్ చరణ్ శుభాకాంక్షలు చెప్పిన విధానం.. దానికి బన్నీ రిప్లై ఇచ్చిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. జాతీయ అవార్డులపై రామ్ చరణ్ ట్వీట్ వేశాడు. ఆ సినిమాకు ఆరు అవార్డులు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పి.. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్‌కు, బుచ్చిబాబు కూడా శుభాకాంక్షలు చెప్పాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ కు – దేవిశ్రీప్రసాద్ కు కలిపి కామన్ గా కంగ్రాట్స్ చెప్పాడు. అంతే తప్ప తన బావ అయిన బన్నీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పలేదు.

చివరలో ఆలియా కి కూడా శుభాకాంక్షలు చెప్పి ముగించాడు. అంటే తన సందేశంలో బన్నీని గుంపులో గోవిందయ్యలా కలిపేసాడు తప్ప ప్రత్యేకంగా అభినందించలేదు. దీనికి బన్నీ కూడా అంతే సింపుల్ గా థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చి ఊరుకున్నాడు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ‌ జరుగుతోంది.

అయితే త్రిబుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ నామినేషన్ వచ్చినప్పుడు బన్నీ పెట్టిన మెసేజ్ కూడా అప్పట్లో చిన్న పాటి దుమారం రేపింది. తన ఫ్యామిలీ హీరో చరణ్‌కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని బన్నీ అదే ట్వీట్లో ఎన్టీఆర్ ను మాత్రం ఆకాశానికి ఎత్తేసాడు. ఇప్పుడు చరణ్ కూడా తనకు టైం రావడంతో అల్లు అర్జున్‌కు అంత ప్రాధాన్యం ఇవ్వకుండా పోస్ట్ పెట్టాడని అంటున్నారు. ఏది ఏమైనా ఇద్దరు హీరోల మధ్య అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకున్నట్టే తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news