Movies' గాండీవ ధారి అర్జున‌ ' … అప్పుడే అన్ని కోట్లకు...

‘ గాండీవ ధారి అర్జున‌ ‘ … అప్పుడే అన్ని కోట్లకు వ‌రుణ్ ముంచేశాడా..!

మెగా ఫ్యామిలీ హీరోలు నటిస్తున్న సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. నెలన్నర రోజుల్లో వచ్చిన మూడు సినిమాలు ఇండస్ట్రీకి కోట్లాది రూపాయల నష్టం కలుగజేసాయి. బ్రో సినిమా దెబ్బతో 30 కోట్లకు బయ్యర్లు మునిగిపోయారు. ఇక భోళాశంకర్ దెబ్బతో ఏకంగా నిర్మాత అనిల్ సుంకర రు. 55 కోట్ల వరకు నష్టపోయాడు. ఇక తాజాగా మరో మెగా హీరో వరుణ్ తేజ్‌ నటించిన గాండీవ ధారి అర్జున సినిమా రిలీజ్ అయింది.

ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయ్యింది. దర్శకుడు ప్రవీణ్ సత్తార్ 54 రోజుల్లో 35 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తానని చెప్పారట. తీరా కట్ చేస్తే సినిమా టోటల్ బడ్జెట్ 55 కోట్లు అయింది. అసలు ఈ సినిమాపై ఇటు ప్రేక్షకులకు.. అటు బయ్యర్లకు ట్రేడ్ వర్గాలలో కూడా ఏమాత్రం ఆసక్తి లేదు. ఇందుకు ఉదాహరణ ఏంటంటే ఈ సినిమాను ముందు రెండు పెద్ద ఏరియాలకు నాలుగు కోట్లకు కొంటానన్న ఒక బయ్యర్ చివరకు 2.60 కోట్లు అని చెప్పి ఆఖరికి కోటి 40 లక్షలు మాత్రమే కట్టాడు.

మీడియం రేంజ్ పెద్ద సినిమాకు అది కూడా రెండు పెద్ద ఏరియాలకు కలిపి కోటి 40 లక్షలు కట్టడం అంటే చాలా చాలా తక్కువ. ఇక మరో పెద్ద ఏరియాకు తాము అస్సలు ఏమీ కట్టం కావాలంటే రిలీజ్ చేస్తాం అంటూ మెండికేసారు. మరో చిన్న ఏరియాకు 70 లక్షల రేంజ్ అనుకున్నది కాస్త 30 లక్షల రేంజ్ లో అడ్వాన్స్ కట్టారు. దీనికి తోడు నిర్మాతకు శాటిలైట్ కాలేదు.. థియేటర్ నుంచి పెద్దగా రాలేదు.. ఇప్పుడు తీరా చూస్తే సినిమా పెద్ద డిజాస్టర్. ఓవరాల్ గా నిర్మాతకు ఈ సినిమా దెబ్బతో రు. 20 కోట్లు ఫ‌ట్‌ అయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news