Newsహైద‌రాబాద్‌లో అగ్నిప్ర‌మాదం.. మ‌ల్టీఫ్లెక్స్‌లో 3 స్క్రీన్లు కాలిపోయాయ్‌..

హైద‌రాబాద్‌లో అగ్నిప్ర‌మాదం.. మ‌ల్టీఫ్లెక్స్‌లో 3 స్క్రీన్లు కాలిపోయాయ్‌..

థియేటర్లలో అగ్ని ప్రమాదాలు జరగకుండా మేనేజ్మెంట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి సినిమా నడుస్తున్నప్పుడు అగ్నిప్రమాదం సంభవిస్తే కేవలం ఆస్తితో పాటు ప్రజల ప్రాణాల‌కు కూడా ఎంతో ప్రమాదం జరుగుతూ ఉంటుంది. అందుకే థియేటర్లు నిర్మించేటప్పుడు ఫైర్ సేఫ్టీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే హైదరాబాదులోని ఓ ప్రముఖ మల్టీప్లెక్స్ లో ఈరోజు ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో అందులో ఉన్న మూడు స్క్రీన్లు పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ చందానగర్ లోని జేపీ సినిమాస్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజలతో మంటలు ఆర్పుతున్నారు. థియేటర్లో ఉన్న మూడు స్క్రీన్లు పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news