తనదైన విలక్షణతతో పాటు బోల్డ్ అప్పిరియన్స్ తో గుబులు రేపుతోంది ఉర్ఫీ జావేద్. టాప్ మోడల్ కం నటి, టాప్ ఎర్నర్ గా ఉన్న ఆమెకు సోషల్ మీడియాలను భారీ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియా ద్వారా తనకు ఎదురైన వేధింపుల గురించి వెల్లడించింది. ఒక వ్యక్తి ఎప్పటినుంచో తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని.. తన నుంచి సైబర్ సె..* డిమాండ్ చేస్తున్నాడని ఆమె వాపోయింది. ఆ వ్యక్తిపై తాను పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశానని.. తన నుంచి సైబర్ సె..* డిమాండ్ చేస్తున్న ఆ బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీసుకోవాలని గతంలో పోలీసులను కోరినా ఇలాంటి చర్యలు లేవని ఉర్ఫీ ఆవేదన వ్యక్తం చేసింది.
రెండు సంవత్సరాల క్రితం ఎవరో నా ఫోటో మార్పింగ్ చేసి షేర్ చేయడం ప్రారంభించారు. దాని గురించి తన అప్పట్లోనే నరకం అనుభవించడంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని.. ఆ వ్యక్తి నా ఫోటోని వెతికి పట్టుకుని మార్ఫింగ్ చేశాడు.. ఆ తర్వాత అతనితో వీడియో సె..* చేయమని నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. లేకపోతే ఆ ఫోటోని బాలీవుడ్ వెబ్ పేజీలలో పెడతానని.. నా కెరీర్ నాశనం చేస్తానని కూడా బెదిరించాడు.. అప్పటినుంచి అతడు నన్ను సైబర్ రే..ప్ చేయమని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు వెల్లడించింది.
ముంబై పోలీసుల గురించి తాను చాలా మంచిగా విన్నానని… అయితే తనను వేధింపులకు గురి చేసిన వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తాను చాలా నిరాశకు గురయ్యానని చెప్పింది. తనను వేధించిన వ్యక్తి ఎంతోమంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టాడో కూడా చెప్పినా వారు పట్టించుకోలేదని… ఏమైనా ఈ వ్యక్తి వల్ల సమాజానికి, మహిళలకు ముప్పు ఉందని ఉర్ఫి తన ఆవేదన వ్యక్తం చేసింది.
ఆ వ్యక్తి ఎవరో ఉర్ఫి క్లూ కూడా ఇచ్చింది. పంజాబ్ పరిశ్రమలో స్వేచ్ఛగా పనిచేస్తోన్న ప్రముఖుడు అని తెలిపింది. ఇక అతడిపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ రాసేందుకు 15 రోజుల పాటు సాకులు చెపుతూనే ఉన్నారు. చివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. అని తెలిపింది.