Moviesబిగ్ బాస్ అలా ఉండబోతుందా..? ప్రోమోతో నే చెమటలు పట్టించిన నాగార్జున(వీడియో)..!!

బిగ్ బాస్ అలా ఉండబోతుందా..? ప్రోమోతో నే చెమటలు పట్టించిన నాగార్జున(వీడియో)..!!

తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన బిగ్బాస్ గురించి అభిమానులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బిగ్ బాస్ ని ఎంతమంది జనాలు తిట్టుకుంటారో.. అంతకు డబల్ రేంజ్ లో ఉండే జనాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . దానికి కారణాలు చాలానే ఉన్నాయి. విషయం ఉన్న విషయం లేకపోయినా ప్రతి దానికి గొడవ పెట్టుకోవడం .. అంతేకాకుండా ఓటీటీకి మించిన బోల్డ్ కంటెంట్ ఇస్తూ ఉండడం రియల్ గానే అక్కడ జరిగే గొడవలను లైవ్ లో చూపించడం బిగ్బాస్ కు బాగా ప్లస్ అయ్యాయి.

అయితే ఈ షోకి వెళ్లిన కొంతమంది జీవితాలు బాగుపడితే చాలామంది జీవితాలు నాశనమయ్యాయి. కాగా పలు భాషల్లో బిగ్ సక్సెస్ అయిన బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లో కంప్లీట్ చేసుకుంది . త్వరలోనే ఏడో సీజన్ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. అంతేకాదు అన్ని సీజన్స్ లాగా ఈసారి కూడా హోస్ట్ నాగార్జునని ఫిక్స్ అయ్యారు .

దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యి అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది . అయితే ప్రోమోలో కూడా నాగార్జున చాలా డల్ గా ఉండడం ఒకప్పటి లుక్స్ లేకపోవడంతో బిగ్ బాస్ పై ఆశలు తగ్గిపోయాయి . ఇలాంటి క్రమంలోనే బిగ్ బాస్ మరో ప్రోమో రిలీజ్ చేసింది . అయితే ఈ ప్రోమోలో కూసింత గట్టిగానే ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే ఈ ప్రోమో జనాలకు టూ ఈవర్ అనిపించింది.

“ఒక కొండపై నుంచి అబ్బాయి పడిపోతుంటే.. తన లవర్ కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడే నాగర్జున వచ్చి ఇలాంటివన్నీ మనం సినిమాలో చూసినవే ఇలాంటి క్లైమాక్స్ లంతా మనకు తెలిసినవే అంటారు . అయితే అదే టైంలో అమ్మాయికి తుమ్మ వచ్చి చేతులను ముక్కుకి అడ్డుపెట్టుకుంటుంది .. ఈ క్రమంలోనే అతనిని కాపాడే క్రమంలో అతడు కింద పడిపోతాడు. ఇది అసలైనటువంటి ట్విస్ట్ ” అని ప్రోమోని కట్ చేశారు . దీంతో సోషల్ మీడియాలో తాజాగా రిలీజ్ అయిన ప్రో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news