యస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా పేరు సంపాదించుకున్న మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ గురించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి . కాగ సినిమా ఇండస్ట్రీలు తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న మంచు మనోజ్ రీసెంట్ గానే పొలిటికల్ లీడర్ భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
అఫ్ కోర్స్ ఇది ఇద్దరికి రెండో పెళ్లి అన్న విషయం అందరికీ తెలిసిందే . అప్పటికే భూమా మౌనిక రెడ్డికి పెళ్లి అయిపోయింది. ఒక బాబు కూడా ఉన్నాడు . ఆ బాబుని తన బిడ్డగా యాక్సెప్ట్ చేస్తూ “శివుడి ఆజ్ఞ ఇది” అంటూ పోస్ట్ చేశారు . అయితే 24 గంటల నుంచి సోషల్ మీడియాలో మరో న్యూస్ వైరల్ గా మారింది. మంచు మనోజ్ తండ్రి కాబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది .
ఆయన తన జీవితంలో మొదటి బిడ్డకి తండ్రి కాబోతున్నాడు అని అలాగే భూమ మౌనిక రెడ్డి రెండో బిడ్డకు జన్మనివ్వబోతుంది అంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో మనసు మనోజ్ పేరు వైరల్ గా మారింది. చూడాలి మరి దీని పై ఈ జంట ఎలా స్పందిస్తుందో..?