నందమూరి నటసింహ బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలతో పాటు కొన్ని ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. బాలయ్య బాబు ఒకసారి డైరెక్టర్ కథ చెప్పి ఓకే అన్నాక అస్సలు సినిమా విషయంలో జోక్యం చేసుకోడు. అయితే కొందరు డైరెక్టర్లు కథ చెప్పేటప్పుడు బాగా నమ్మించి అంతా ఓకే అయ్యాక తీరా సినిమా తీసేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ పోయి బాలయ్యకు డిజాస్టర్లు ఇచ్చారు.
ఇలా భారీ అంచనాలతో వచ్చే సినిమాలు చాలానే ఉన్నాయి. అలా రిలీజ్ కి ముందు అదిరిపోయే అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయిన సినిమా “ఒక్కమగాడు”. నందమూరి కుటుంబం వీరాభిమానిగా చెప్పుకునే వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో బాలయ్య నటించిన సినిమా ఒక్కమగాడు. అనుష్క – నిషా కొటారి – సిమ్రాన్ హీరోయిన్లుగా నటించారు. ఎన్నో అంచనాలతో ఈ సినిమా చూసేందుకు థియేటర్లకి వెళ్లిన ప్రేక్షకులకు మతులు పోయాయి.
భారతీయుడు సినిమాను పోలి ఉందన్న విమర్శలకు వచ్చాయి సగటు సినీ అభిమానులను పక్కన పెడితే కనీసం బాలయ్య అభిమానులను కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. చివరికి ఈ సినిమా బాలయ్య బాబు కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.ఈ సినిమా డిజాస్టర్ అయ్యాక బాలయ్య చౌదరికి గట్టి వార్నింగ్ ఇచ్చారట. ఇంకోసారి నువ్వు నందమూరి కాంపౌండ్ లో అడుగు పెట్టవద్దని.. అసలు నందమూరి హీరోలతో సినిమా చేయాలన్న ఆలోచన విరమించుకో అని కరాకండిగా చెప్పేసారట.
బాలయ్య ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఒక రేంజ్ లో ఇరగదీస్తాను.. మీకు కెరీర్ లో తిరిగిలేని హిట్ ఇస్తాను అంటూ భారీ ఆశలు కలిగించాడట. తీరా బాలయ్య మంచి ఛాన్స్ ఇచ్చినా చేజేతులా నాశనం చేయడంతో పాటు బాలయ్య పరువు పోయేలా ఒక చెత్త సినిమా తెరకెక్కించాడు. దీంతో బాలయ్యకు సైతం కోపం వచ్చింది అని.. ఏ సినిమా ప్లాప్ అయినా దర్శకులను పెద్దగా పట్టించుకోని బాలయ్య వైవిఎస్ చౌదరికి మాత్రం గట్టి వారిని ఇచ్చారన్న గుసగుసలు అయితే అప్పట్లో ఇండస్ట్రీలో వినిపించాయి.