Moviesపెళ్ళి పీటలు ఎక్కబోతున్న మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ .. ఈ...

పెళ్ళి పీటలు ఎక్కబోతున్న మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ .. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదుగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న Rashi khanna పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవును అని అంటున్నారు ఆమె సన్నిహితులు, ఫ్రెండ్స్ , సినీ వర్గాలు. రాశిఖన్నా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా కాలమే అవుతుంది . ఊహల గుసగుసలాడే అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తన దైన స్టైల్ లో నటిస్తూ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రి లో నటించి మెప్పించింది .

ముఖ్యంగా తన క్యూట్ లుక్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది . రీసెంట్ గానే తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పకనే చెప్పేసిన రాశి ఖన్నా రీసెంట్గా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి . ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” ఒకప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించి బ్రేకప్ అయ్యానని.. అతని వల్ల డిప్రెషన్ కి గురవ్వడంతో బరువు పెరిగానని.. ఆ తర్వాత కొద్ది రోజులకి మరో వ్యక్తి పరిచయం అయ్యాడని.. ఆ వ్యక్తి కారణంగా నేను లావు తగ్గానని చెప్పుకొచ్చింది”.

“అంతేకాదు మొదట ఫ్రెండ్స్ గా ఉన్న మేము ఆ తర్వాత డేటింగ్ చేయడం వల్ల నేను లావు తగ్గాను అంటూ ఓపెన్ గా చెప్పుకు వచ్చింది . అయితే ఆ వ్యక్తి పేరు మాత్రం మెన్షన్ చేయలేదు రాశి కన్నా . అమ్మడు డైటింగ్ చేస్తుందంటే ఓ బడా సెలబ్రిటీ అయినా ఉండాలి ..? లేదా బిగ్ షాట్ అయినా అయ్యి ఉండాలి ..? అయితే ఈరోజుల్లో డేటింగ్ అనేది చాలా కామన్ . ఇప్పుడు డేటింగ్ చేస్తున్న పాప రేపు పెళ్లి చేసుకోదా..?అంటూ జనాలు ట్రొల్ చేస్తున్నారు. అంతేకాదు రాశిఖన్నా పెళ్లి పై వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అన్ని కుదిరితే రేపో మాపో ఈ బ్యూటీ గుడ్ న్యూస్ చెప్పే విధంగా ఉన్నారు అంటున్నారు జనాలు. అంతేకాదు రాశిఖన్నా బాయ్ ఫ్రెండ్ ఎవరై ఉంటారా..? అంటూ గూగుల్లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news