టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్న టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ఆయన భార్య నమ్రతల జంట ఇండస్ట్రీలో ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉంటుంది. అంతేకాదు వీళ్ల పెళ్లి అయ్యి చాలా ఏళ్లు గడుస్తున్నా సరే ఇప్పటికి ఎంతో క్యూట్ రొమాంటిక్ గా కపుల్ గా ఇండస్ట్రీలో రాజ్యలేలేస్తున్నారు. తాజాగా వీళ్లకి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది .
తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత మాట్లాడుతూ తన కెరియర్లో ఎన్నో సినిమాల్లో నటించానని అందరితో కలిసినటించడం హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చింది . అంతేకాదు ఫ్యూచర్లో మీరు మహేష్ బాబుతో కలిసి నటిస్తారా..? అన్న ప్రశ్నకు ..”..అస్సలు లేదు మహేష్ బాబు నన్ను అడగరు ..నేను ఆయన సినిమాలో నటించను.. కేవలం ఆయన సినిమాలోనే కాదు ఏ సినిమాలోని నేను నటించను ..నా టోటల్ లైఫ్ ఫ్యామిలీకి పిల్లలకి అంకితం “అంటూ చెప్పుకు వచ్చింది .
అంతేకాదు మహేష్ బాబు నటించిన సినిమాలలో మీకు నచ్చిన సినిమా ఏది ..? అని అడగగా టక్కున సైనికుడు అంటూ ఆన్సర్ ఇచ్చింది . “మహేష్ బాబు సినిమాలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని నాకు నచ్చుతాయి ఫేవరెట్ గా ఉంటాయి. కానీ ఎందుకో సైనికుడు సినిమాకి నేను కనెక్ట్ కాలేకపోయాను.. ఓసారి టీవీలో ఈ సినిమా చూస్తున్న టైం లో నాకు కోపం వచ్చేసి ఏకంగా రిమోట్ ని పగలగొట్టేసాను..” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . కేవలం నమ్రతకే కాదు జనాలకి సైతం ఆ సినిమా చూసినప్పుడు అలాంటి ఫీలింగే కలిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్..!!