Moviesదర్శకులను రివ‌ర్స్‌లో మార్చుకుంటున్న చిరు - బాలయ్య... !

దర్శకులను రివ‌ర్స్‌లో మార్చుకుంటున్న చిరు – బాలయ్య… !

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నట‌సింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఫుల్ జోష్ మీద దూసుకుపోతున్నారు. ఒక మూవీ షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాని లైన్లో పెడుతూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఆరుపదుల వయసు వచ్చినా కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ ఉత్సాహంతో సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోని ఇద్దరు అగ్ర హీరోలు వారు చేసే సినిమాలుకు ఇప్పుడు దర్శకులను కూడా మార్చుకుంటున్నారని వారు కమిట్ అయ‌న‌ సినిమాలను చూస్తే అర్థమవుతుంది. ఈ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చి బంపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు మెగా దర్శకుడు బాబి దర్శకత్వం వహించారు. ఇప్పుడు బాబి బాలయ్యతో ఆయన 109వ సినిమా చేయడానికి కమిటీ అయ్య‌డు. ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా త‌మ‌న్నాపేరు వినిపిస్తోంది.
ఇక అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.

ఇక అదే విధంగా నట‌సింహం బాలకృష్ణ కూడా ప్రస్తుతం స్టార్‌ దర్శకుడు అనిల్ రావిపూడితో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. అయితే దర్శకుడు అనిల్ తన తర్వాత సినిమాని మెగాస్టార్ చిరంజీవితో చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ సర్కిల్స్‌లో ఓ టాక్ వైరల్ గా మారింది.

ప్ర‌స్తుతం భోళాశంక‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న చిరు ఆ సినిమా త‌ర్వాత కుర‌సాల క‌ళ్యాణ్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్త‌యిన వెంట‌నే అనిల్ రావిపూడి సినిమా చేస్తార‌ట‌. ఇలా ఈ ఇద్దరు అగ్ర హీరోలు తమ సినిమాలతో పోటీ పడుతూ అదే విధంగా ఒకరికి హిట్ ఇచ్చిన దర్శకులతో మరొకరు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news