ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా అందాల ముద్దుగుమ్మలు పెళ్లి పీటలు ఎక్కేస్తూ వస్తున్నారు . ఇప్పటికే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రి లో ఉండే స్టార్ బ్యూటీస్ అందరు పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో సెటిలైపోతూ ఉండగా..త్వరలోనే తెలుగు టాప్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. యస్.. తెలుగు స్టార్ హీరోయిన్ గా పాపులారిటి దక్కించుకున్న తమన్న త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట.
ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో ప్రేమలో ఉంది..డేటింగ్ కూడా చేస్తుంది. ఇదే విషయాన్ని ఆమె ఒప్పుకునింది . రీసెంట్గా ఇద్దరు వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2 లో నటించారు . ఇలాంటి క్రమంలోనే ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విజయ్ వర్మ పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నానని త్వరలోనే పెళ్లి చేసుకుంటానని పరోక్షంగా హింట్ ఇచ్చేశాడు .
విజయ్ వర్మ మాట్లాడుతూ ..” ఫోన్ చేస్తే చాలు మా అమ్మ పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని.. నన్ను చంపేస్తుంది . ఇన్నాళ్లు అంటే సినిమాలు ఉన్నాయి .. కాల్ షీట్స్ .. బిజీ బిజీ అని చెప్పి తప్పించుకున్నాను. కానీ ఇక అలా తప్పించుకోలేను .. ప్రజెంట్ ఫ్రీగా ఉన్నాను.. ఇన్నాళ్లు విజయవర్మ అంటే అందరికీ విలన్ గానే గుర్తొచ్చేవాడు.. కానీ నాలో రొమాంటిక్ యాంగిల్ ని నిద్రలేపింది తమన్నా..అందుకే నేను కూడా త్వరగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను” అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీనితో సోషల్ మీడియాలో తమన్నా – విజయవర్మల పేర్లు మరోసారి మారుమ్రోగిపోతున్నాయ్..!!