Moviesఅప్పుడు సాయి పల్లవి..ఇప్పుడు శ్రీలీల..ఆ ఒక్కటి చూసే జనాలు ఎగబడిపోతున్నారా..!

అప్పుడు సాయి పల్లవి..ఇప్పుడు శ్రీలీల..ఆ ఒక్కటి చూసే జనాలు ఎగబడిపోతున్నారా..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది అందాల ముద్దుగుమ్మ శ్రీలీల . టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ భారీ రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమాలు అన్నిటిలోనూ శ్రీ లీల భాగమయింది . అది టాలీవుడ్ హీరో కాదు ..స్టార్ హీరో కాదు ..సీనియర్ హీరో కాదు అందరూ కూడా అమ్మడుతో సినిమాలు చేయాలని భీష్ముంచుకుని కూర్చున్నారు . దానికి కారణం శ్రీలీల అందం అంటూ కొందరు అంటుంటే కాదు కాదు ఆమెలోని నటనా టాలెంట్ అంటూ మరికొందరు చెప్పుకొస్తున్నారు. మేకర్స్ కూడా దానికి తగ్గట్టు ఆమె పేరే జపిస్తూ ఉండడంతో ఆమె హవా కొనసాగుతుంది.

అయితే శ్రీలీలను ఎక్కువ మంది హీరోలు ఇష్టపడడానికి కారణం ఆమె మల్టీ టాలెంటెడ్ అంటూ తెలుస్తుంది. కేవలం నటన ..అందం ..డాన్స్ ..కాదు శ్రీలీల మంచి పాటలు పాడే అమ్మాయి కూడా . ఆమె లో పాటలు పాడే సింగర్ కూడా దాగి ఉంది అంటూ తెలుస్తుంది. అంతేకాదు శ్రీ లీల ఏ డైరెక్టర్ తన వద్దకు వచ్చిన సాఫ్ట్ వే లోనే రిప్లై ఇస్తుందట . తనకు కథ నచ్చిన నచ్చకపోయినా ఎంతో మర్యాదపూర్వకంగానే ఆ కథను రిజెక్ట్ చేస్తుందట .

అంతేకాదు రెమ్యూనరేషన్ విషయంలో అడిగి మరి తనకు ఎంత కావాలో అంత తీసుకుంటుందట . ఈ క్రమంలోనే శ్రీ లీల సెట్స్ కి టైం టు టైం వచ్చేసిందట. సేమ్ టు సేమ్ ఇదేం విధంగా గతంలో సాయి పల్లవి కూడా ఉండేది అని ఆ కారణంగానే ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకుని మరి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అని.. ఇప్పుడు అదే స్ట్రాటజీని ఫాలో అవుతూ శ్రీలీల సైతం టాప్ పొజిషన్లో దూసుకుపోతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి ఇండస్ట్రీలో మరో సాయిపల్లవిల మారిపోయింది శ్రీ లీల..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news