హీరోయిన్ తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని దశాబ్దాలు దాటేస్తుంది . అయినా ఇప్పటికీ హీరోయిన్గా పలు అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ప్రెసెంట్ ఆమె చేతిలో రెండు బడా సినిమాలు ఉన్నాయి . రజనీకాంత్ సరసన జైలర్.. మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్..రెండు సినిమాలు ఒక్కరోజు తేడాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి . ఆగస్టు 10న జైలర్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతూ ఉంటే అలాగే ఆగస్టు 11న భోళా శంకర్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .
ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా.. లైఫ్ స్టైల్ చాలా కాస్ట్లీ గా ఉంది . ఈ క్రమంలోనే ఆమె ఎంత సంపాదిస్తుంది అన్న విషయం వైరల్ గా మారింది. కాగ దాదాపు 17 ఏళ్ల నుంచి టాలీవుడ్ హీరోయిన్గా కొనసాగుతున్న తమన్నా ఒక్క సినిమాకి నాలుగు నుంచి ఐదు కోట్లు తీసుకుంటుందట . వీటితోపాటు కమర్షియల్ యాడ్స్ పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ మరికొన్ని కోట్లు తన ఖాతాలో వేసుకుంటుంది.
అంతేకాకుండా తమన్నాకు ఫారిన్ కంట్రీస్ లో ఫుడ్ బిజినెస్ కూడా ఉన్నాయి అంటూ తెలుస్తుంది . 2017 వైట్ అండ్ గోల్డ్ పేరుతో జ్యూవెలరీ బిజినెస్ సైతం స్టార్ట్ చేసింది . ఈ బిజినెస్ లో మిల్కీ బ్యూటీ సూపర్ సక్సెస్ అయింది. అంతేకాకుండా వారసత్వంగా వచ్చే ఆస్తి కూడా తమన్నా ఖాతాలో వచ్చి చేరింది. అలా అటు ఇటు తిరగేసి చూసుకున్న ఎంత కాదన్నా ఆమె ఆస్తి 220 కోట్లకు పైగానే ఉంటుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అంతే కాదు తమన్న వద్ద రెండు భారీ వజ్రాల మూఠలు కూడా ఉన్నాయని ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది. ఇవే కాకుండా ఆమెకు పలు ప్రాపర్టీలు.. కార్లు ..ఫ్లాట్స్.. విల్లాస్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది . దీంతో ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ లో తమన్నానే ఎక్కువ ఆస్తి కూడ పెట్టుకుంది అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి..!!