Moviesమోక్షజ్ఞ సినిమాలో మరో స్టార్ కిడ్.. ఇది కదా రా నందమూరి...

మోక్షజ్ఞ సినిమాలో మరో స్టార్ కిడ్.. ఇది కదా రా నందమూరి ఫ్యాన్స్ కి కావాల్సింది..!!

ఇది నిజంగా నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నెక్స్ట్ వారసుడిగా మోక్షజ్ఞ ఎప్పుడు తెరపైకి ఎంట్రీ ఇస్తాడా..? ఎలాంటి సినిమాతో జనాలను ఆకట్టుకోబోతున్నాడు ..? ఎలాంటి అవార్డ్స్ ను కొల్లగొడతారా..? తాత తండ్రిని మించిన స్థాయిని అందుకోగలడా ..? లేడా..? అంటూ రకరకాల ప్రశ్నలు నందమూరి అభిమానుల మెదడులో మెదిలాయి . కాగ రీసెంట్గా నందమూరి మోక్షజ్ఞ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

నందమూరి మోక్షజ్ఞ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ఇండస్ట్రీకి తెరంగేట్రం చేయబోతున్నాడని .. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల సెలెక్ట్ అయింది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే గత 24 గంటల నుంచి ఈ సినిమాలో మరో స్టార్ కిడ్ కూడా నటించబోతున్నాడు అంటూ తెలుస్తుంది . ఆయన మరెవరో కాదు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాన్ష్. ఈ సినిమాలో మోక్షజ్ఞ చైల్డ్ హుడ్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడట దేవాన్ష్.

ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .మొదటి సినిమాతోనే ఇలా ఇద్దరు స్టార్స్ ఎంట్రీ ఇవ్వబోతూ ఉండడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . కాగా మొదటి నుంచి సినిమాలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేని నారా బ్రాహ్మిణి తన కొడుకు ఇంట్రెస్ట్ మేరకే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకునిందట. చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news