టాలీవుడ్ యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ నటిస్తున్న సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన చిన్న అప్డేట్ రిలీజ్ అయితే ఫాన్స్ లో ఎక్కువ ఉత్సాహం కనిపిస్తుంది. అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు.
రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది . కాగా ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ సెలెక్ట్ చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే . జాన్వి కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. చాలా ట్రెడిషనల్ గా అట్రాక్టివ్ గా కనిపించింది జాన్వి కపూర్ .అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ కన్నా ముందే హీరోయిన్ అలియా భట్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా అనుకున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి .
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆలియా భట్ ను కొరటాల శివ దర్శకత్వంలో తెరలెల్లే మూవీ కోసం ఫిక్స్ చేసుకున్నారట . అంతేకాదు ఎన్టీఆర్ సైతం ఓకే చేశారట . కానీ ఆలియా భట్ ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ రావడంతో ఈ సినిమా నుంచి తప్పుకునిందట . ఆ కారణంగానే అగ్రిమెంట్ పై సైన్ చేసిన కూడా ఈ అగ్రిమెంట్‌ను క్యాన్సిల్ చేసుకుని రెమ్యూనరేషన్ గా ఇచ్చిన డబ్బులను తిరిగి ఇచ్చేసి మరీ ఈ సినిమా నుంచి తప్పుకుందట. ఆ తర్వాత ఈ రోల్ కోసం చాలామందిని ట్రై చేయగా ఫైనల్లీ జాన్వీ కపూర్ సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపించాయి . మొత్తానికి జాన్వీ కపూర్ ఎంట్రీ ఎన్టీఆర్ తోనే రాసిపెట్టింది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..?