Newsకోట్ల ఆస్తి ఉన్నా.. స్టార్ రేంజ్ లో పాపులారిటీ ఉన్నా..శ్రీలీల ఆ...

కోట్ల ఆస్తి ఉన్నా.. స్టార్ రేంజ్ లో పాపులారిటీ ఉన్నా..శ్రీలీల ఆ విషయంలో దురదృష్టవంతురాలే..!?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు .. ఒక్కొక్క ముద్దుగుమ్మకు ఒక్కొక్క రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్. అయితే సోషల్ మీడియాలో మాత్రం టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది అందాల ముద్దుగుమ్మ శ్రీలీల . కేవలం సోషల్ మీడియాలోనే కాదు సినిమా ఇండస్ట్రీలో కూడా ఎక్కువ మంది శ్రీలీల పేరుని జపిస్తున్నారు . దానికి కారణం అమ్మడు క్రేజ్ అనే చెప్పాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే చిన్న హీరో దగ్గర నుంచి బడా హీరో వరకు ఇంకా చెప్పాలంటే.. టాప్ మోస్ట్ సీనియర్ హీరో వరకు శ్రీలీల తమ సినిమాలో పెట్టుకోవడానికి చూస్తున్నారు. ఎక్కువగా లైక్ చేస్తున్నారు.

అయితే ఎంతో క్రేజ్ సంపాదించి ..ఇంతటి పాపులరిటి పబ్లిసిటీ సంపాదించుకున్న శ్రీలీల తన లైఫ్ లో మధురమైన బాల్యాన్ని మాత్రం చాలా మిస్ అయిందట. మరీ ముఖ్యంగా ఆమె లైఫ్ లో తండ్రి ఉన్నా లేనట్టే అంటూ ఆమె తండ్రి ప్రేమను కోల్పోయినట్లు జనాలు చెప్పుకుంటున్నారు. శ్రీ లీల కడుపులో ఉండగానే వాళ్ళ అమ్మానాన్న మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారట . ఆ తర్వాత శ్రీ లీలాను తన తండ్రి దగ్గర తీసిందే లేదు అంటూ తెలుస్తుంది .

అంతేకాదు శ్రీలీల సైతం బాల్యం నుంచి అమ్మ పెంపకంలోనే పెరగడంతో అమ్మనే ఎక్కువగా లైక్ చేసిందట. అయితే ఆడపిల్లకి తల్లి ప్రేమ ఎంత ముఖ్యమో తండ్రి ప్రేమ కూడా అంతే ముఖ్యం . కానీ శ్రీలీలకు ఆ ప్రేమ దక్కలేదు. ఇప్పటికీ కూడా శ్రీలీల నాన్న ప్రేమ కోసం పరితపించిపోతుంది . అయినా సరే శ్రీ లీల వాళ్ళ నాన్నగారు ఆమెను యాక్సెప్ట్ చేయడం లేదు . దీంతో సోషల్ మీడియాలో శ్రీలీల కు ఎంత ఆస్తి ఉన్న ..ఎంత క్రేజ్.. పబ్లిసిటీ ఉన్న .నాన్న అన్న పిలుపుకు దూరమైందని.. నాన్న ఇచ్చే ప్రేమకు నోచుకోలేకపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు . ఈ రకంగా చూసుకుంటే శ్రీ లీల ఆ విషయంలో చాలా దురదృష్టవంతురాలి అని చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news