సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలా ప్రవర్తిస్తున్నారో .. ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియని పరిస్థితి ఎదురైపోతుంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలైతే ఎలా విచ్చలవిడిగా రెచ్చిపోయి బోల్డ్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారో మనకు తెలిసిందే. అయితే కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోతూ మరోపక్క సోషల్ మీడియాలో తమ అందచందాలతో కుర్రాళ్లకి నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నారు.
కాగా అలాంటి లిస్టులో టాప్ మోస్ట్ పోజీషన్ లో ఉంటుంది స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ . ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . తనదైన స్టైల్ లో పలు సినిమాల్లో నటిస్తూ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ బడాబడా సినిమాలలో నటిస్తుంది . రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలోని ప్రముఖ హీరోయిన్గా నటిస్తున్న కియారా.. ఈ మధ్యనే తాను ప్రేమించిన బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది . వీళ్ళ పెళ్లి బాలీవుడ్ లోనే అత్యంత ఖరీదైన పెళ్లిలో ఒకటిగా నమోదు చేసుకుంది .
కాగా ఇలాంటి క్రమంలోనే కియారాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మొన్న ఆ మధ్య కియారా ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం జరిగింది . అయితే ఆ తర్వాత అలాంటిదేమీ లేదు అంటూ క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇలాంటి క్రమంలోనే కియారాఫ్యాన్స్ ని సాటిస్ఫై చేస్తూ కొందరు ఆకతాయిలు ఆమె ఓల్డ్ వీడియో ట్రెండ్ చూస్తున్నారు .
గతంలో 2019లో వచ్చిన గుడ్ న్యూస్ సినిమా రిలీజ్ సమయంలో ఆమె మాట్లాడుతూ తనకు ప్రెగ్నెంట్ కావాలని ఉందని చెప్పుకొచ్చింది . అయితే తాను ఎందుకు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నానో చెప్పి షాక్ ఇచ్చింది కియారా . “ఆ టైంలో ఎవరు ఏమి అనరు.. చాలా కేరింగ్ లభిస్తుంది.. తనకు నచ్చిన ఫుడ్ ఇష్టం వచ్చినట్లు తినచ్చు ..అందుకే ప్రెగ్నెంట్ కావాలనుకుంటున్నాను అంటూ చెప్పుకు వచ్చింది . దీంతో ఈ కామెంట్స్ ని మళ్ళీ ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . ప్రెగ్నెన్సీ అనేది ఓ ఫీలింగ్ ..అది ఎంజాయ్ చేయాలి కానీ ఇలా తిండి కోసం ప్రెగ్నెంట్ అవుతావా? ఇంతకన్నా దిగజారుడు మరొకటి ఉంటుందా అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు..!!